Begin typing your search above and press return to search.
పరిటాల సునీత వర్సెస్ పయ్యావుల కేశవ్
By: Tupaki Desk | 14 Dec 2015 6:41 AM GMTఅనంతపురం జిల్లా టీడీపీలో నేతలు గ్రూపులు..గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఎత్తులు..పై ఎత్తులు వేసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న రెండు ప్రధాన వర్గాల్లో ఒక వర్గానికి మంత్రి పరిటాల సునీత నాయకత్వం వహిస్తుంటే..మరో వర్గానికి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నాయకుడిగా ఉన్నారు. ఈ ఇద్దరు ఆధిపత్యం కోసం ట్రై చేస్తుంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎవరితోను కలవకుండా స్వతంత్ర్యంగా ఉంటూ ఆయన సపరేటుగా ఓ గ్రూపు మెయింటింగ్ చేస్తున్నారు. అనంత అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గానికి అస్సలు పడడం లేదు. ఇక ఎప్పటి నుంచో శత్రువులు అయిన దివాకర్ రెడ్డి, పరిటాల సునీత వర్గానికి కూడా సరైన సంబంధాలు లేవు.
పరిటాలకు వైరి వర్గమైన జేసీ వర్గం పయ్యావుకు సపోర్ట్ చేస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిచి ఉంటే మంత్రి పదవి విషయంలో సునీతకు - పయ్యావులకు మధ్య గట్టి ఫైట్ ఉండేది. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోవడంతో సునీతకు మంత్రి పదవి దక్కింది. తర్వాత పయ్యావుల ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి మళ్లీ ఆయన జిల్లా రాజకీయాలపై ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నా చాలా విషయాల్లో సునీత మాటే చెల్లుబాటు అవుతోంది. సునీత మహిళ కావడంతో ఆమెను ఒంటరి చేద్దామని జిల్లాలో మిగిలిన టీడీపీ గ్రూపులు ఒక్కటువుతున్నా ఆమెకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండదండలు పుష్కలంగా ఉండడం బాగా కలిసొస్తోంది. బాలకృష్ణతో పెట్టుకునే సాహసం ఎవ్వరూ చేయలేరు.
అయితే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి - ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎవ్వరితోను కలవకుండా తమది చంద్రబాబు వర్గం అని చెపుతున్నారట. అలాగే పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథికి సునీతకు విబేధాలు ఉన్నాయి. ఏదేమైనా జిల్లాలో కదిరి - ఉరవకొండ మినహా అన్ని ఎమ్మెల్యే స్థానాలు..స్థానిక సంస్థలను కైవసం చేసుకున్న టీడీపీ నాయకుల మధ్య ఉన్న విబేధాలతో కార్యకర్తలు - స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎవరివైపునడవాలో తెలికయక పెద్ద గందరగోళంలో ఉన్నారు.