Begin typing your search above and press return to search.
ఆ హీరో మీద ఆమె పగ తీర్చుకుంటోందట
By: Tupaki Desk | 26 Oct 2017 12:47 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపులకు సంబంధించి కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా భారీ చర్చకు తెర తీసింది. ఈ ఉదంతం మొత్తం ఒక క్రైం సినిమాను తలపించేలా ఉండటం తెలిసిందే. ఈ కేసులో మలయాళ ప్రముఖ నటుడు దిలీప్ అరెస్ట్ కావటంతో పాటు మూడు నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో దిలీప్ అమాయకుడని.. అతనికేమీ తెలీదంటూ పీసీ జార్జ్ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ అతని మీద పగ తీర్చుకునే పనిలో ఉందంటూ ఆరోపించటంతో పాటు.. ఆమె తీరుపై పలుసందేహాలు వ్యక్తం చేయటం గమనార్హం.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించాడు. మంజు మంచి నటి అని.. ఆమె నటనంటే తనకిష్టమన్నారు. అయితే.. ఆమెది చాలా కఠినమైన హృదయంగా అభివర్ణించారు. గతంలో దిలీప్.. మంజు చాలా చక్కటి జీవితాన్ని గడిపారని.. అయితే ఇప్పుడామె సరైన దారిలో లేదన్నారు.
మంజు విడాకులు తీసుకోదని.. అదే సమయంలో దిలీప్ కు మరో అవకాశం లేకుండా చేసిందని.. ఇప్పుడేమో అతనిపై పగ తీర్చుకునే పనిలో పడిందన్న ఆరోపణలు చేశారు. దిలీప్ లాంటి అమాయకుడ్ని 85 రోజుల పాటు జైల్లో పెట్టటం దారుణమన్న జార్జ్.. దిలీప్ మీద బోలెడంత సానుభూతిని వ్యక్తం చేశారు. సంచలన వ్యాఖ్యలు చేయటం పీసీ జార్జ్‌కు కొత్తేం కాదు. హీరోయిన్ లైంగిక వేధింపులు గురి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఆమెపై వేధింపులు నిజమైతే తెల్లారే షూటింగ్‌కు ఎలా వెళ్లిందంటూ ప్రశ్నించటం పెను దుమారాన్నే రేపింది. పీసీ జార్జ్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన సదరు బాధిత నటి కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు లేఖ రాశారు. పీసీ జార్జ్ తాజా వ్యాఖ్యలపై దిలీప్ మాజీ సతీమణి మంజు వారియర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.