Begin typing your search above and press return to search.

ఇండియన్ క్రికెట్ పై పీసీబీ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు: క్రీడాభిమానుల ఫైర్

By:  Tupaki Desk   |   24 July 2022 8:31 AM GMT
ఇండియన్ క్రికెట్ పై పీసీబీ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు: క్రీడాభిమానుల ఫైర్
X
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచంలోని క్రీడాభిమానులకు ఆసక్తే. ఏ జట్టు గెలుస్తుందో చూడాలన్న తాపత్రయం అందరికీ ఉంటుంది. ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎక్కువ గా ఇండియానే గెలిచింది. అయితే ఎప్పుడో ఒకసారి ఆ జట్టు విన్నయితే జీవితంకాలం తామే విజేత అన్న భావనలో ఉంటుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ (పీసీబీ). ఆ విషయం తాజాగా నిరూపితమైంది. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ఇండియన్ క్రికెట్ పై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. టీమిండియాపై రమీజ్ చేసిన వ్యాఖ్యలు క్రీడాలోకంలో దుమారం లేపాయి. ఇండియన్ క్రికెట్ టీం ను చిన్న చూపు చేస్తూ మాట్లాడడంతో ఇండియన్ అభిమానులు మండిపడుతున్నారు.

పాకిస్తాన్ జట్లు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక్కడ జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ పాకిస్తాన జట్టు గెలుచుకుంది. శ్రీలంక 341 పరుగులు చేయగా లక్ష్యాన్ని చేధించింది. పాక్ జట్టులో ప్రధానంగా అజామ్ 118, అబ్దుల్లా షపీఖ్ 160 పరుగులు చేశారు. అబ్దుల్లా ఆఖరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ గెలవడంతో పాకిస్తాన్ జట్టు ఆనందానికి అవసధుల్లేకుండాపోయింది. ఈ క్రమంలో పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించి టీమిండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'పాక్ క్రికెట్ టెస్ట్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ గెలుపు. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు సభ్యులు అద్భుతంగా ఆడారు. వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ మా టీం మ్యాచ్ గెలుపు కోసం ఎంతో శ్రమపడ్డారు. ప్రస్తుతం గాలె విజయం మాకు చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఇంతకుముందు మేము బెంగుళూరులో భారత్ పై గెలిచిన మ్యాచ్ తోఈ మ్యాచ్ సమానం' అని రఫీజ్ అన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఆడుతూ టీం గెలుపు కోసం కృషి చేస్తున్నారని అన్నారు.

భారత్ పై పాక్ బెంగుళూరు వేదికగా 1987లో గెలిచింది. ఈ మ్యాచ్ లో 204కే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ 16 పరుగుల తేడాతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-6తో కైవలం చేసుకుంది. దీనిని ఉద్దేశించి రమీజ్ టీమిండియాపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో క్రీడాభిమానులు రఫీజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందర్భం లేకుండా టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుూ వివాదాస్పదుడిగా మారుతున్నాడని అంటున్నారు. చిన్న చిన్న విజయాలకే పెద్ద గొప్పలుగా చెప్పుకుంటూ సంబరపడిపోతున్నాడని అంటున్నరు.

ఇప్పటికే అనేక సార్లు ఐపీఎల్ విషయంలో భారత్ క్రికెట్ పై రఫీజ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి అనవసరంగా కలగజేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ తో సంబంధం లేకున్నా అనవసరంగా వ్యాఖ్యలు చేయడంతో క్రీడాభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందోనని ఎదురుచూస్తున్నారు.