Begin typing your search above and press return to search.

రాజీవ్ స్మ‌ర‌ణ చేయ‌ని పీసీసీ ! ఎందుక‌ని?

By:  Tupaki Desk   |   21 May 2022 7:30 AM GMT
రాజీవ్ స్మ‌ర‌ణ చేయ‌ని పీసీసీ ! ఎందుక‌ని?
X
నేడు వ‌ర్ధంతి .. రాజీవ్ గాంధీ వ‌ర్ధంతి. ఈ స‌మయాన పీసీసీ (ఏపీ విభాగం) ఆయ‌న కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగానే నిర్వ‌హించి వారికి నివాళులివ్వాలి. కానీ ఎక్క‌డా ఆ దాఖ‌లాలే లేవు. జిల్లాల‌లో కూడా దివంగ‌త నేత కు సంబంధించి కార్య‌క్ర‌మాలే లేవు. ఎందుక‌నో ఈ సారి ఎవ్వ‌రూ పెద్ద‌గా ఈ కార్య‌క్ర‌మానికి ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఇక దేశానికి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం అవ‌స‌రం అని భావిస్తున్న ఈ త‌రుణాన ఆయన బిడ్డ‌ల‌ను తెలుగు రాష్ట్రాలు పెద్ద‌గా ఆద‌రించ‌డం లేదు. అదేవిధంగా యూపీలో కూడా పెద్ద‌గా వారికి ఆద‌ర‌ణ లేదు. సోనియాకు పార్టీకీ మ‌ధ్య ఉన్న దూరం పెరిగి పెద్ద‌ద‌వుతోంది.

ఇలాంటి త‌రుణాన రాజీవ్ వ‌ర్ధంతి రావ‌డం.. యాదృశ్చిక‌మే కావొచ్చు కానీ పార్టీని ఏక‌తాటిపై న‌డిపే కార్య‌క్ర‌మాల‌ను పెద్ద‌గా మిస్ చేసుకోకూడ‌దు. ఆ మాట‌కు వ‌స్తే వైఎస్ జ‌యంతినో, వ‌ర్ధంతినో ఇవాళ్టికీ కాంగ్రెస్ (ఏపీ మ‌రియు టీజీ) చేస్తోంది. వైఎస్ ను త‌మ కుటుంబ స‌భ్యుడిగానే భావిస్తామ‌ని ఇప్ప‌టికీ ఇరు రాష్ట్రాల నేత‌లూ అంటుంటారు. మ‌రి! ఆ స్థాయి రాజీవ్ కు ఎందుకు లేదు. ఇది కూడా ఆలోచించాలి క‌దా !

వాస్త‌వానికి కొన్ని వివాదాల మిన‌హా రాజీవ్ త‌రువాత కాంగ్రెస్-ను స‌మ‌ర్థ రీతిలో న‌డిపిన మ‌హిళా నేత సోనియానే ! సముద్రం లాంటి పార్టీలో తుఫానులు స‌హ‌జ‌మే అయినా వాటిని సులువుగా తీరం దాటించ‌డంలో ఆమె స‌ఫ‌లీకృతం అయ్యారు.

అందుకే ఆమె ఇప్ప‌టికీ కొన్ని విశిష్ట లేదా విభిన్న ల‌క్ష‌ణాలు ఉన్న అధినేత్రిగా గుర్తింపు పొందుతూనే ఉన్నారు. ఆ స్థాయిలో ఆమె బిడ్డ‌లు రాహుల్ కానీ ప్రియాంక కానీ రాణించ‌లేక‌పోతున్నారు. కొంత‌లో కొంత కూడా ప‌రిణితి చూపించ‌లేక‌పోతున్నారు అన్న‌ది ఓ విమ‌ర్శ.

పార్టీ ప‌గ్గాలు రాహుల్ అందుకే అందుకోవ‌డం లేదేమో ! సుదీర్ఘ ప్ర‌స్థానం త‌రువాత కాంగ్రెస్ కు ఇప్పుడు ఉన్న స‌మ‌స్య‌లు లేదా అప‌రిష్కృత వివాదాలు గ‌తంలోనూ ఉన్నాయి. వేర్పాటు అన్న‌ది మంచిదే అని నిరూపించిన నాయ‌కులూ ఉన్నారు. ఆ విధంగా శ‌ర‌త్ ప‌వార్ ద‌గ్గ‌ర నుంచి జ‌గన్ వ‌ర‌కూ అంతా ఎవ‌రి దారిలో వారు వెళ్లి మంచి పేరే తెచ్చుకున్నారు.

కానీ కొంద‌రు స‌మ‌ర్థ నాయ‌కుల‌ను, వారి ఓటు బ్యాంకుల‌ను వ‌ద్దనుకుని లేదా వ‌దులుకుని సోనియా త‌ప్పు చేశారు. రాజీవ్ హయాంలో జ‌రిగిన మంచి త‌రువాత జ‌రిగిన మంచి ఇవ‌న్నీ కాంగ్రెస్ ఇప్పుడు క‌లిసి రాని విష‌యాలు. అందుకే ఆ దివంగ‌త నేత స్మ‌ర‌ణ ఎక్క‌డా కాన‌గ రావ‌డం లేదు. క‌నిపించ‌ని లేదా వినిపించ‌ని వైనానికి తార్కాణంగా నేటి ప‌రిణామాలే ఉన్నాయి.