Begin typing your search above and press return to search.

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టండి ..ఎవరన్నారంటే ?

By:  Tupaki Desk   |   9 July 2020 4:45 AM GMT
తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టండి ..ఎవరన్నారంటే ?
X
తెలంగాణాలో కరోనా మహమ్మారి విజృంభణ పెరిగిపోతుంది. దీనిపై తెలంగాణ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని, పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా పాలన లో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని.. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్తూ వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని పొన్నాల డిమాండ్ చేశారు.

అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గత 13 రోజులుగా ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని , చివరికి రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడిపై సమీక్ష కోసం గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని పిలిస్తే వారు వెళ్లలేదని తెలిపారు.రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ అవేమి పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ...ఈ సమయంలో సచివాలయం కూల్చడం ఏంటి అని ప్రశ్నించారు. కరోన నా సమయంలో జనం బయటకు వచ్చే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను బందోబస్తుగా ఉంచి రోడ్లను దిగ్బంధనం చేసి కూల్చడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అని పొన్నాల అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని బీజేపీ నాయకులే అంటున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులని ఒకసారి అంచనా వేసి రాష్ట్రపతి పాలన పెట్టించండి అని తెలిపారు.