Begin typing your search above and press return to search.

రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు.. తెర‌వెనుక చంద్ర‌బాబు ఉన్నారా? రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   28 Jun 2021 6:33 AM GMT
రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు.. తెర‌వెనుక చంద్ర‌బాబు ఉన్నారా?  రీజ‌నేంటి?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి విష‌యం.. రాజ‌కీయ వ‌ర్గాల మ‌ధ్య హాట్ టాపిక్‌గా కొన‌సాగుతూనే ఉంది. ఆయ‌న నియామ‌కాన్ని.. అనేక కోణాల్లో ప‌రిశీలిస్తున్నారు మేధావులు. ఇక‌, రాజ‌కీయ నేత‌లు కూడా.. `ఇలా ఎలా జ‌రిగింద‌బ్బా!` అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. దీనికి కార‌ణం.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చి కేవ‌లం మూడేళ్లు మాత్ర‌మే. 2018లో ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. ఆ ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అలాంటి నాయ‌కుడికి ఇప్పుడు ఏకంగా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం అంటే.. `ఏదైనా` జ‌రిగే ఉంటుంద‌ని.. సీనియ‌ర్లు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా సీనియ‌ర్ నాయ‌కుడు.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్‌కు ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు.. చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టీ ఇప్పుడు చంద్ర బాబు వైపు మ‌ళ్లింది. నిజంగానే ఆయ‌న ఈ వ్య‌వ‌హారంలో వేలు పెట్టారా? అనే దిశ‌గా ఆలోచ‌న‌లు సాగుతున్నాయి. కార‌ణాలు ఏవైనా.. టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఆయ‌న టీడీపీకి రిజైన్ చేసి.. స్వ‌యంగా అప్ప‌టి సీఎంగా ఉన్న చంద్ర‌బాబుకు అందించి వెళ్లిపోయారు.

ఆ వెంట‌నే రేవంత్ వెళ్లి ..రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డా.. రేవంత్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేసింది లేదు. చంద్ర‌బాబును ప‌న్నెత్తు మాట అన్న‌ది కూడా లేదు. ఇదిలావుంటే.. చంద్ర‌బాబు .. 2018 ఎన్నిక‌ల లో కాంగ్రెస్‌తో దోస్తీ క‌ట్ట‌డం.. రాహుల్‌తో క‌లిసి వేదిక‌లు పంచుకోవ‌డం తెలిసిందే. ఇక‌, ముంద‌స్తు వ్యూహంలో భాగంగానే రేవంత్ ను స్వ‌యంగా చంద్ర‌బాబే కాంగ్రెస్‌లోకి పంపార‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబుకు రెండు స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌టి.. తెలంగాణ‌లో టీడీపీని నిల‌బెట్ట‌డం, రెండు.. కేసీఆర్‌కు చెక్ పెట్ట‌డం.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ నిల‌బ‌డ‌డం అంటే.. క‌ష్ట‌మే. కేసీఆర్ దూకుడుతో.. పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పుంజుకుంటే.. కార్య‌కార‌ణ సంబంధంగా.. టీడీపీ పుంజుకుంటుంది. ఇక్క‌డే ఉంది.. అస‌లు కిటుకు. టీఆర్ ఎస్ గూటికి చేరిన టీడీపీ నేత‌ల‌ను వెన‌క్కి తెచ్చుకోవ‌డంతోపాటు.. కాంగ్రెస్ పుంజుకుంటే.. బీజేపీ దూకుడుకు, కేసీఆర్ వ్యూహాల‌కు కూడా చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని.. త‌ద్వారా టీడీపీ కూడా పుంజుకుంటుంద‌ని బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ పుంజుకుంటే.. ఏపీలోనూ బ‌లోపేతం అవుతుంద‌ని బాబు కాంగ్రెస్ పెద్ద‌ల‌కు వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీపీసీసీ పీఠం నెల‌కొన్న‌.. వివాదం స‌మ‌యంలో.. చివ‌రి నిముషంలో జోక్యం చేసుకున్నార‌ని.. రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా.. అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణ‌లోనూ ఒన‌గూరే ప్ర‌యోజనాల‌పై స్వ‌యంగా రాహుల్‌కే వివ‌రించార‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రి బాబు అనుకున్న విదంగా ఒక్క రేవంత్.. ఇరు రాష్ట్రాల్లోనూ ప్ర‌భావం చూపిస్తాడా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.