Begin typing your search above and press return to search.
సంచలన నిర్ణయం.. ఆ సర్టిఫికెట్ ఉంటే పెట్రోల్ పోస్తారట.. ఎక్కడంటే!
By: Tupaki Desk | 29 Jan 2022 2:30 PM GMTసాధారణంగా వాహనదారులు ఎవరైనా.. పెట్రోల్ పోయించుకోవాలంటే.. డబ్బులు ఉండాలి. అయితే.. ఈ విషయంలో కొన్నాళ్ల కిందట కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు తీసుకువచ్చారు. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయిన నేపథ్యంలో బైకర్లు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పోస్తామని.. ఆదేశాలు జారీ చేశాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది కొన్నాళ్లు అమలైంది. అయితే.. ఇప్పుడు వీటికి మించి.. ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆదేశాలు జారీ చేసింది.
శీతాకాలంలో ఉత్తరాదిని వేధిస్తున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రతీ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ పోసే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు పొల్యూషన్ సర్టిఫికెట్ను కలిగి ఉండడం తప్పనిసరి చేసింది. ఈ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తారు. ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రజలను కోరింది.
ఢిల్లీలో కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలను తిరగనీయకుండా.. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని ఆస్వా దించేందుకు ఈ విధానం దోహదపడుతుందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. పౌరులకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి కేజ్రీవాల్ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు. వాహన యజమానులు కచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ను పెట్రోల్ బంకుల వద్దకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
దానికి వ్యాలిడిటీ ఉంటేనే పెట్రోల్ పోస్తారు. వాస్తవానికి ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన విధానం. ఢిల్లీతోపా టు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు శీతాకాల సమయంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నా యి. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే కాలుష్య కోరల నుంచి రాష్ట్రాన్ని కొంతవరకు అయినా కాపాడొచ్చు... అని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ సర్టిఫికెట్లను ప్రతీసారి చూడాలంటే వాహనదారులతో పాటు పెట్రోల్ పంపు యజమానులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఇలా పెద్దపెద్ద క్యూలు లేకుండా ఉండేలా ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.