Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి సవాలు.. అలా అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాడట

By:  Tupaki Desk   |   17 April 2021 10:30 AM GMT
పెద్దిరెడ్డి సవాలు.. అలా అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాడట
X
తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ అనూహ్య పరిణామాలకు తెర తీస్తోంది. జిల్లాల నుంచి బస్సుల్లో తిరుపతికి పెద్ద ఎత్తున వస్తున్నారని.. దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా వ్యూహం పన్నినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు.. ఓట్లు వేసే వారిని మీ నాన్న పేరేమిటి? మీ ఇల్లు ఎక్కడ? ఇంటి అడ్రస్ ఏమిటి? అన్ప ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు చెప్పని పరిస్థితి.

తిరుపతి పట్టణంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఓటు వేయటానికి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు ఓటు వేసేందుకు వచ్చిన వారిని బేసిక్ ప్రశ్నలు వేస్తే.. సమాధానం చెప్పకపోవటానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు.

దీనంతటికి కారణం మంత్రి పెద్దరెడ్డ రామచంద్రారెడ్డి అంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆయనకు సంబంధించిన కల్యాణ మండపంలో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను ఉంచారన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇలాంటివేళ.. మంత్రి పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ అనుకూల మీడియా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుందని.. ఓటర్లను మీడియా ఇబ్బంది పెట్టటంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

తనను నారా లోకేశ్ వీరప్పన్ గా ట్వీట్ చేశారని.. రాజకీయ లబ్థి కోసం ఏదంటే అది మాట్లాడితే ఉపేక్షించమని.. కిరణ్ కుమార్ తో కలిసి టీడీపీ వాళ్లే ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారన్నారు. తనను స్మగ్లర్ గా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

తిరుపతి యాత్రా స్థలం కావటంతో ప్రైవేటు బస్సులు వస్తాయని.. అవన్నీ వైసీపీ బస్సులుగా పేర్కొనటం దారుణమన్నారు. మరి.. పెద్దిరెడ్డి చెప్పినట్లుగా తిరుపతి యాత్రా స్థలమే అనుకుందాం. కానీ.. అలా వచ్చిన వారు కోవిడ్ నేపథ్యంలో ముందస్తుగా దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి కదా? మరి.. అలాంటిదేమీ లేకుండా ఇప్పుడున్న పరిస్థితిలో తిరుపతి ఎందుకు వచ్చినట్లు? ఈ ప్రశ్నలకు పెద్దిరెడ్డి ఏమని సమాధానం ఇస్తారు?