Begin typing your search above and press return to search.

కేసీఆర్‌, కేటీఆర్‌ లకు లెక్క‌ల్లో తేడా !!

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:53 PM GMT
కేసీఆర్‌, కేటీఆర్‌ లకు లెక్క‌ల్లో తేడా !!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఆయ‌న త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కు మ‌ధ్య లెక్క‌ల్లో తేడా వ‌చ్చింద‌ట‌. ఏం లెక్క‌లు - ఏమిటా తేడా - అన్నదిఎవ‌రు అనేదే కమీ సందేహం? అయితే దానికి తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి స‌మాధానం చెప్తున్నారు. నూతన ప్రభుత్వం యొక్క పాలన విధానాన్ని చూస్తే ఎంత అసమర్థంగా ప్ర‌భుత్వం ఉందో అర్థమవుతుందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 10% మాత్రమే రోడ్లు దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... 11వేల కోట్ల రూపాయలు ఉంటే తప్ప రోడ్లను మరమత్తులు చేయలేమని కేటీఆర్ అన‌టం ఏమిట‌ని పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు. 10% రోడ్లను బాగుచేయడానికి రూ.11వేల కోట్లు అవసరమైతే 90% రోడ్లు మరమత్తులు చేయడానికి రూ.1 లక్షా 20వేల కోట్లు కావాలా? అంటూ పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు.

తాజాగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫామ్ హౌస్‌ లో కూర్చొని ఉంటే 10% రోడే దెబ్బతిన్నాయనే తప్పుడు సమాచారమే వస్తుంద‌ని మండిప‌డ్డారు. రోడ్ల వెంట - బస్తీల వెంట తిరిగితే ఎన్ని రోడ్లు పాడైనాయో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రోడ్లను అద్దంలా చేస్తామన్నారని.. అద్దంలా అంటే రోడ్ల‌పై గుంత‌లు - వాటిలో నీళ్లేనా అంటూ ఎద్దేవా చేశారు. "జీహెచ్ ఎంసీ ఎన్నికల టీఆర్ ఎస్ మ్యానిఫెస్టోలో, ఆ తరువాత 100 రోజుల ప్రణాళికలో చెప్పింది ఏమిటీ, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటీ? నాలాలను బాగుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 480 కోట్లు ఇస్తే, వాటిని ఏ నాలాలను బాగుచేయడానికి ఉపయోగించారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. జీహెచ్ ఎంసీ రూ. 5వేల కోట్ల బడ్జెట్‌ ను జీరో స్థాయికి తెచ్చారు. రూ.800 కోట్లు ఫిక్స్డ్‌ డిపాజిట్లను కూడా ఖర్చు చేశారు. రిపేర్లకు ఒక్క రూపాయి కూడా లేకుండా చేశారు" అంటూ మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, జీహెచ్ ఎంసీ వెంట‌నే గ్రేట‌ర్‌ లోని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని పెద్దిరెడ్డి కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/