Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో పోటీపై పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 16 Jun 2021 1:30 PM GMTఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను ఎలా తీసుకుంటారని ఏకంగా బీజేపీ అధిష్టానాన్నే పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
అయితే ఇప్పుడు అధిష్టానం పెద్దలు నచ్చజెప్పారో ఏమో కానీ పెద్దిరెడ్డి మాట మార్చారు. తాను నాలుగు సార్లు హుజూరాబాద్ నుంచి పోటీచేశానని.. రెండు సార్లు మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. అలాంటి తనను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడమే బాధ కలిగించిందన్నారు. ఈటల బీజేపీలో చేరితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానన్నారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆ పార్టీలో అసమ్మతికి దారితీసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ కే చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్ది రెడ్డి స్వయంగా ఈటల చేరికను వ్యతిరేకించారు. హుజూరాబాద్ లో పోటీచేసి తీరుతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ యే కాదు.. బీజేపీలోకి సీఎం కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని మాజీ మంత్రి , బీజేపీ నేత పెద్దిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ అభ్యర్థి గురించి ఆలోచిస్తామని.. అవకాశం వస్తే హుజూరాబాద్ లో పోటీచేస్తానని వెల్లడించారు.
కేసీఆర్ ను తాను కలవలేదని.. ఆయన ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో తెలియదని పెద్దిరెడ్డి అన్నారు. బీజేపీలో చాలా మంది అభ్యర్థులున్నారని.. అందరూ అర్హులేనని పెద్ది రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి తను చేసిన వ్యాఖ్యలను విరమించుకున్నారు. మెత్తబడి బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తానని ప్రకటించడం కొసమెరుపు.