Begin typing your search above and press return to search.
బాబుకు మద్దతిచ్చేందుకు జగన్ రెడీ
By: Tupaki Desk | 19 July 2016 5:58 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిగ్గులేకుండా వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పరిస్థితి చూస్తే తెదేపాలో ఉన్న అభద్రతాభావం స్పష్టమౌతుందని అన్నారు. వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు మాని ప్రజాస్వామ్య పాలన అందించాలని వ్యాఖ్యానించారు. దమ్ముంటే వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి - మరలా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. జంపింగ్ ఎమ్మెల్యేలు గెలిస్తే తామే బాబుకు మద్దతు ప్రకటిస్తామని ప్రకటించారు.
సీఎం చంద్రబాబునాయుడు సంపాదనా కోసమే పరిపాలన సాగిస్తున్నారని ఆ తీరును వదులుకొని ప్రజల కోసం పాలించే ఆలోచనతో ముందుకు సాగాలని పెద్దిరెడ్డి హితవు పలికారు. ఎమ్మెల్సీ గాలి ముద్దకృష్ణమనాయుడు కక్షసాధింపు రాజకీయాలను ప్రోత్సహించడం మానుకోవాలని హెచ్చరించారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు ఈ కక్షసాధింపునకు నాలిగింతలు ఫలితం తెదేపా నాయకులు అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే ఆర్.కె.రోజా మాట్లాడుతూ కళ్లునెత్తికెక్కి చంద్రబాబునాయుడు పాలిస్తున్నాడని, 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి నేడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. త్వలోనే ప్రజలు చొక్కాపట్టుకుని నిలదీసే రోజులు వస్తున్నాయన్నారు. ప్రతిపక్షనేతలపై ఎస్సీ - ఎస్టీ తప్పుడు కేసులు బనాయించి వేధించే చేష్టలు ప్రోత్సహిస్తున్నారని రోజా విమర్శించారు. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకుల చేతులలో తోలుబొమ్మలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో వైకాపా నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించి వేధించినందుకే ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడును ప్రజలు ఓడించారన్నారు.భయపెడితో పార్టీ వదిలి తెదేపాలోకి వస్తారని కలలుకనే చంద్రబాబుకు జిల్లాలో చుక్కెదురేనన్నారు.