Begin typing your search above and press return to search.
తగ్గేది లేదన్న పెద్దిరెడ్డి - చంద్రబాబుపై కుల అస్త్రమే!
By: Tupaki Desk | 1 March 2020 7:57 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన స్వకుల ప్రయోజనాల కోసమే పాటు పడుతూ ఉన్నారని ధ్వజమెత్తారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడి తీరును రామచంద్రారెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ విషయంలో కుల అస్త్రాన్ని మంత్రి గట్టిగానే సంధిస్తూ ఉండటం గమనార్హం! చంద్రబాబు నాయుడు 29 గ్రామాలకు, అందునా మూడంటే మూడు గ్రామాల ప్రయోజనాల గురించినే మాట్లాడుతూ ఉన్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ధ్వజమెత్తుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మరి కాస్త లోతుకు వెళ్లే వాళ్లు చంద్రబాబు నాయుడు కమ్మ వాళ్ల జనాభా ఉన్న చోట, వారి ఆస్తుల ధరలకు విలువ పెరిగే చోట మాత్రమే రాజధాని ఉండాలనే ఆలోచనతో ఉన్నారనే విమర్శలు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఏపీ మంత్రి కూడా అదే విషయాన్ని నొక్కి వక్కాణించారు. చంద్రబాబు నాయుడు ఆయన సొంత కుల ప్రయోజనాల కోసమే పాకులాడుతూ ఉన్నారని కుండబద్ధలు కొట్టారు మంత్రి. తాము రాష్ట భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుగా, మూడు ప్రాంతాలూ బాగుండాలని మూడు రాజధానుల ప్రతిపాదనను రెడీ చేసినట్టుగా మంత్రి చెప్పారు. చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం కమ్మ కుల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ఉన్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన వారే ఈ మంత్రిగారు అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేవలం ఆయన స్వకుల ప్రయోజనాల కోసమే పని చేస్తూ ఉన్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తడం ఆసక్తిదాయకంగా మారింది. ఇలా చంద్రబాబు మీద కుల ముద్ర గట్టిగానే పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కమ్మ వాళ్ల జనాభా బాగానే ఉంటుంది, అయినా పెద్దిరెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు ఏమీ పట్టించుకోకుండా.. చంద్రబాబు నాయుడు ఆయన స్వకుల ప్రయోజనాల కోసమే పని చేస్తూ ఉన్నారంటూ ఘాటుగా ధ్వజమెత్తడం గమనార్హం.