Begin typing your search above and press return to search.
వైసీపీ నేతల నమ్మకాన్ని పెద్దిరెడ్డి నిలబెడతారా?
By: Tupaki Desk | 18 April 2016 8:47 AM GMTఏపీలో ఫిరాయింపుల రగడ వైసీపీ - టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఎన్ని మాటలు చెబుతున్నా ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండడంతో వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. జగన్ కు ముఖ్య అనుచరులు అనుకున్నవారు కూడా పార్టీకి రాంరాం చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు అంటే విరుచుకుపడే చిత్తూరు జిల్లా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పార్టీని వీడుతారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ వర్గాలు తీవ్రంగానే స్పందించాయి. పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయన పార్టీ మారబోరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు - ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను టీఆరెస్ లో చేరుతానన్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వైసీపీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో లేదని ఆయన అంటున్నారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారాన్నీ వైసీపీ వర్గాలు అడ్డుకుంటున్నాయి. పెద్దిరెడ్డిని చిత్తూరు జిల్లా టైగర్ గా అభివర్ణిస్తూ... అటు సూర్యుడు ఇటు పొడిచినా కూడా పెద్దిరెడ్డి టీడీపీలోకి వెళ్లరని అంటున్నారు. చివరకు చంద్రబాబు తన ముఖ్యమంత్రి సీటు ఖాళీ చేసి ఆఫర్ చేసినా కూడా పెద్దిరెడ్డి వైసీపీని వీడే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరి చిత్తూరు జిల్లా నేతల నమ్మకాన్ని పెద్దిరెడ్డి ఎంతవరకు నిలబెడతారో చూడాలి.