Begin typing your search above and press return to search.
బతకాలని రాసి పెట్టి ఉంటే.. ఎలా ఉంటుందో చెప్పే వీడియో
By: Tupaki Desk | 25 Oct 2019 3:57 AM GMT ముంచుకొచ్చిన చావు నుంచి తప్పించుకోవటం సాధ్యమా? అంటే నో అంటే నో అనేస్తారు. కానీ.. లక్ ఉంటే అదేమీ పెద్ద విషయం కాదు. చేతులు జాపుకుంటూ వచ్చే చావు కూడా సుడి ఉంటే..దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చో చెప్పే రియల్ వీడియో ఇది. దేవుడున్నాడా? లేడా? అన్నది పక్కన పెడితే.. మీకీ భూమి మీద ఉండేందుకు మీ టికెట్ టైం అవ్వలేదనిపించే ఈ పదమూడు సెకన్ల వీడియోను ఒక్కసారి చూస్తే విషయం పెద్దగా అర్థం కాదు.
కాస్త స్లోమోషన్ లో.. ఆగి.. ఆగి చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. రాసి పెట్టి ఉంటే ఎంత పెద్ద విపత్తు నుంచైనా త్రుటిలో తప్పించుకోవచ్చన్నట్లు ఉండే ఈ వీడియోను అరిజోనాలోని ఫీనిక్స్ పోలీస్ శాఖ విడుదల చేసింది.
ఇండియన్ స్కూల్ ఇండర్ సెక్షన్ వద్ద పసిబిడ్డను ఉంచిన స్ట్రోలర్ తో రోడ్డు దాటుతున్న భార్య..భర్తల్ని వాయువేగంతో దూసుకొచ్చిన ఎస్ వీయూ నుంచి కాపాడిన మరో కారును చూస్తే.. అద్భుతమన్నట్లుగా అనిపించకమానదు. జస్ట్ రెండు మూడు సెకన్లు తేడా పోయే ప్రాణం నిలిచి ఉండటం నిజంగానే సుడిగా అనిపించక మానదు.
రెడ్ లైట్ పడి వాహనాలు నిలిచి ఉంటే.. అంతులేని వేగంతో వచ్చిన ఎస్ వీయూ గీత దాటేసి రోడ్డు దాటున్న ఫ్యామిలీ మీదకు దూసుకొచ్చింది. కనురెప్ప తేడాతో ముంచుకొచ్చిన చావును.. తన దారిన తాను పోవాలనుకునే కారు ఢీ కొనటంతో.. టార్గెట్ తప్పి ఎస్ వీయూ కారు పక్కకు వెళ్లిపోయింది. పక్క నుంచి పలుకరించేంతలా వచ్చి వెళ్లిన మరణాన్ని చూసిన వారు భయంతో వణికిపోవటం కనిపిస్తుంది.
భారీ ప్రమాదం చోటు చేసుకోకుండా ఎస్ వీయూను ఢీ కొట్టిన కారును ఒక మహిళ నడుపుతున్నట్లు గుర్తించారు.ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు గుర్తించారు. ఇక.. నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేసిన ఎస్ వీయూ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.