Begin typing your search above and press return to search.
మంత్రి హర్టయితే ఇలాగే ఉంటుంది మరి
By: Tupaki Desk | 3 Nov 2016 4:41 AM GMTఅమాత్యులు అలక బూనితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ - శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత తనకు గౌరవం దక్కని సంఘటనతో అలక వహించగా ఈ కార్యక్రమ నిర్వాహకులు విమర్శల పాలవడమే కాకుండా నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాల కేంద్రం ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖా మంత్రి హోదాలో మంత్రి కామినేని శ్రీనివాస్ - స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి స్థాయిలో మంత్రి పీతల సుజాతను విశిష్ట అతిథులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి - శివరామరాజు - ఎమ్మెల్సీ సూర్యారావులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆరోగ్య శాఖా మంత్రి హోదాలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఈ సందర్భంగా పీతల సుజాత హర్ట్ అయ్యారు. కారణం ఏంటంటే...ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించిన శిలా ఫలకంలో తన పేరు చివరన ఉండటంతో సుజాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. తమ నాయకురాలికి అవమానం జరిగిందని మంత్రి పీతల సుజాత అనుచరులు ఆందోళన వ్యక్తం చేసి నిర్వాహకులపై మండిపడ్డారు. ఇదిలాఉండగా మరో కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీరవాసరంలో గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి సుజాతకు ఆహ్వానం అందలేదు. దీంతో ఫైర్ అయిన మంత్రి అనుచరులు తమ నాయకురాలిని ఆహ్వానించలేదని నిరసన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/