Begin typing your search above and press return to search.

ఏపీలో పెగాస‌స్‌.. చివ‌రికి స‌ర్కారు తేల్చింది ఏంటంటే!

By:  Tupaki Desk   |   21 Sep 2022 4:32 AM GMT
ఏపీలో పెగాస‌స్‌.. చివ‌రికి స‌ర్కారు తేల్చింది ఏంటంటే!
X
పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి ఫోన్‌ ట్యాపింగ్ జరిపారంటూ వచ్చిన ఆరోపణలపై అధ్యయనానికి ఏర్పాటైన సభా సంఘం తన మధ్యంతర నివేదికను మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సమర్పించింది.

కాల్‌ ట్యాపింగ్‌ నుంచి సమాచారం దొంగించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది. అయితే.. ఈ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ప‌రిశీలిస్తే.. ఆప‌రేష‌న్ స‌క్సెస్ బ‌ట్‌.. పేషంట్ డెడ్‌.. అన్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

తాజాగా శాసనసభకు భూమన సమర్పించిన మధ్యంతర నివేదికలో డేటా చోరీపై కమిటీ ఇప్పటికీ ఎటువంటి నిర్దారణకు రాలేదని మాత్రం స్పష్టమైంది. సమాచారం బయటకు వెళ్లింది కానీ, ఎవరికి వెళ్లిందో తేల్చకపోవడం గమనార్హం.

ఐపీ అడ్రస్ వివరాల కోసం గూగుల్‌ను అడిగినా లాభం లేకపోయిందంటూ నివేదికలో సభా సంఘం స్పష్టం చేసింది. గుర్తు తెలియని ఐపీ అడ్రస్సుకు డేటా వెళ్లిందంటూ నివేదికలో వెల్లడించారు.

గుర్తు తెలియకున్నా డేటా చౌర్యం మాత్రం జరిగిందనే నిర్దారణకు వచ్చేశామంటూ నివేదికలో కమిటీ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్‌కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ల నుంచి గుర్తు తెలియని సర్వర్ ఐపీలకు వెళ్లిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్‌ను కోరింది.

అయితే.. సభా సంఘం పంపిన ఐపీ అడ్రస్సుల వివరాలను గుర్తించలేమని గూగుల్ సంస్థ తేల్చి చెప్పింది. సదరు ఐపీ అడ్రస్సులు గూగుల్‌కు చెందినవే అయినా ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించనందున గుర్తింపు కష్టమని గూగుల్ పేర్కొంది. దీనిపై తదుపరి సంప్రదింపుల కోసం తమ న్యాయ విభాగానికి ఈమెయిల్ పంపాలని గూగుల్ సూచించింది. వేర్వేరు సర్వర్లలోని ఐపీ అడ్రస్‌ల జాబితాను నివేదికలో కమిటీ పొందుపర్చిం




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.