Begin typing your search above and press return to search.
పెగాసస్ : మమతక్కతో వివాదమా ! ఎందుకు జగన్ ?
By: Tupaki Desk | 24 March 2022 2:30 AM GMTపెగాసస్ వివాదం కారణంగా ఏపీలో కొన్ని రాజకీయ పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. కానీ జగన్ మాత్రం తెలివిగా ప్రవర్తిస్తూ ఒడ్డెక్కిపోతున్నారు. సభా సంఘం ఏర్పాటు చేసి మరోసారి విపక్షం తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇచ్చానని అంటున్నారు. అయితే ఇందులో కొత్తగా సాధించిందేమీ లేదని తాము ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయలేదని టీడీపీ అంటోంది.
కానీ జగన్ మాత్రం వీటికి ఏ విధంగా ముగింపు ఇస్తారో.. సీన్లోకి దీదీ వచ్చారు కనుక వివాదం పెరిగి పెద్దదయి ఆమె చుట్టూ కూడా రేపటి వేళ చక్కర్లు కొట్టేందుకు అవకాశం ఉంది అని తెలుస్తోంది.అప్పుడు దీదీతో జగన్ తగువు పెట్టుకుంటారా ? జగడాలమారి తో కయ్యానికి కాలు దువ్వగలరా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క తో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తగువు పెట్టుకోనున్నారు అని తేలిపోయింది. ఓ విధంగా ఇది టీఎంసీకి మరియు వైసీపీకి మధ్య జరుగుతున్న లేదా నలుగుతున్న రగడ.పెగాసస్ స్పైవేర్ కొనుగోలు పై అక్క చెప్పిన మాటలు తెలుగు తమ్ముళ్లకు రుచించలే! వైసీపీకి కూడా అంతగా నచ్చలే! అందుకే స్పీకర్ సీతారాం సభా సంఘం ఏర్పాటుకు ముందుకు వచ్చారు.వాస్తవాలు తెలుసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని ఆయన భావిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ వివాదం ఉంది కానీ పెద్దగా వెలుగులో లేదు.
పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే ఈ గొడవే లేదు. కానీ మన అసెంబ్లీ మాత్రం ప్రజా సమస్యలు అన్నీ గాలికొదిలేసి ఇదొక్కటే తమకు ప్రథమావధి అన్న విధంగా పనిచేస్తుందన్న ఆరోపణలు మాత్రం ఇవాళ వస్తున్నాయి. నిమిషానికి ఎనిమిది వేలు వెచ్చించి నిర్వహించే అసెంబ్లీ లో పెగాసస్ వివాదం, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, అవమానాలు తప్ప గడిచిన ఏడేళ్లలో జరిగింది ఏమీ లేదు.ఇందుకు టీడీపీ కానీ వైసీపీ కానీ మినహాయింపు కాదు. ఇక మమత పేల్చిన బాంబు కారణంగా ఒక్కసారిగా టీడీపీ కుదేలయిపోయింది.
స్వీయ విమర్శ కు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే సమయంలో ప్రధానంగా ఉన్న వైసీపీ వర్గాలను కూడా లక్ష్యపెడుతూ చాలా వ్యాఖ్యలు చేసింది.అయితే ఎప్పటి నుంచో జగన్ వర్గాలకూ మమతా బెనర్జీ వర్గాలకు ఉన్న స్నేహం కారణంగా ఆమె చేసిన ఆరోపణలపై మరింత దుమారం రేగింది. వాస్తవానికి కేంద్రంలో మోడీకి ప్రత్యామ్నాయంగా కదలిక రావాలంటే అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ మమతకు సాయం చేయాల్సిందే!
తాజా ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు పక్కకు తప్పుకుంటే అప్పుడు దీదీకి వైసీపీతో దోస్తీనే దిక్కు అవుతుంది.అందుకే జగన్ ఎక్కడా టీఎంసీ అధినేత్రిని టార్గెట్ చేయడం లేదు. టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.ఆ విధంగా ఆయన వివాదాన్ని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నారన్న వాదన ఒకటి మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది.ఇదే సమయంలో అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన విసిగిస్తోంది కూడా!