Begin typing your search above and press return to search.
సర్కారుని కడిగేసిన మహిళకు పెన్షన్ రద్దు?
By: Tupaki Desk | 2 Jun 2022 7:31 AM GMTఆంధ్రావనిలో ఏం మాట్లాడినా కూడా ఒప్పుకునేలా లేరు అని, ఆ విధంగా పింఛన్ల నిలిపివేతకూ ఇతర సంక్షేమ పథకాల నిలిపివేతకూ వెనుకాడడం లేదని ఓ వాదన వినిపిస్తోంది. ఇందుకు ఉదాహరణలు కూడా కోకొల్లలు ఉన్నాయి. సర్ మీ కాళ్లు పట్టుకుంటాను కాస్త కనికరించండి అని గోడు పెట్టుకున్నా వినిపించుకున్నా, కనికరించి ఆదుకున్న దాఖలాలు ఏవీ లేవు.
ఏమంటే ఇవన్నీ 75 ఏళ్ల వెనుకబాటుకు కారణాలు. మేం ఇప్పుడేం వచ్చాం అన్నింటినీ దిద్దుతున్నాం అని చెప్పుకుని తప్పుకు తిరగడం తప్ప వైసీపీ ఏమీ సాధించడం లేదని విపక్షం మండిపడుతోంది.
దీంతో పింఛన్లు రాక వృద్ధులు, నిజాలు మాట్లాడి ఇబ్బందులు పడుతున్నారని తాజాగా ఇందుకు తార్కాణంగా బొబ్బిలిలో ఓ ఘటన చోటు చేసుకుందని టీడీపీ అంటోంది.
ఏం జరిగిందంటే..
ఇటీవల బొబ్బిలిలో ఓ మహిళ విపక్షం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో గొంతెత్తింది. అస్సలు పాలన ఏమీ బాలేదని చెప్పేసింది. ధరలు విపరీతంగా ఉన్నాయని గొల్లపల్లి (బొబ్బిలి మున్సిపాల్టీ పరిధి) మహిళ గొంతెత్తి తన గోడు చెప్పింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆమెకు సంబంధించిన వివరాలు అన్నింటినీ పాలకపక్షం సేకరించింది.
ఈ నెల నుంచి వృద్ధాప్య పింఛను నిలిపివేసింది. ఇదీ ఆమె గోడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబోదిబోమంటోంది. నిజాలు మాట్లాడినంతనే పెన్షన్ నిలుపుదల చేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది.
అయితే అధికారులు మాత్రం సాంకేతిక కారణాలతోనే పింఛను ఆగిందని అంటున్నారు.టీడీపీ మాత్రం అదొక సాకు మాత్రమే అని, తమ ఎదుట నిజాలు మాట్లాడిందని నెపంతో, ఇప్పటిదాకా ఆమె భర్తకు అందించిన పింఛను కాస్తా నిలుపుదల చేయడం వైసీపీ వేధింపులకు తార్కాణం అని అంటున్నారు.