Begin typing your search above and press return to search.
చైనాతో ప్రమాదం.. పెంటగాన్ నివేదిక ఏం చెబుతోంది?
By: Tupaki Desk | 4 Nov 2021 11:07 AM GMTచైనా తీరు ప్రపంచానికి తలనొప్పిగా మారుతోంది. కరోనా మహమ్మరితో ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసిన డ్రాన్ కంట్రీ మరోసారి దుందూడుకు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా తన ఉనికి కాపాడుకునేందుకు చైనా తన సరిహద్దు దేశాలతో కొద్దిరోజులుగా తరుచూ కయ్యానికి దిగుతోంది. భారత్ తో సరిహద్దు వివాదం కొనసాగుతుండగానే చైనా పశ్చిమ హిమాలయాల్లో చేపడుతున్న పైబర్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ఓ నివేదికలో వెల్లడించడం సంచలనంగా మారింది.
గాల్వాన్ లోయ సంఘటన తర్వాత చైనా-భారత్ మధ్య ఉద్రికత పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే. ఒకనొక సమయంలో చైనా వస్తువులను బహిష్కరించేందుకు భారతీయులు సిద్ధమయ్యారు. కేంద్రం సైతం చైనా విషయంలో కఠినంగా వ్యవహరించడంతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ భారత్ చైనా తీరును అంతర్జాతీయంగా ఎండగట్టడంతో చైనా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే కొన్నిరోజులు స్తబ్ధుగా ఉన్న చైనా మళ్లీ సరిహద్దుల్లో కొత్త పన్నాగానికి తెరలేపుతోందనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.
తాజాగా పెంటగాన్ 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో సైనిక, భద్రతా అభివృద్ధి-2021' పేరుతో ఒక నివేదికను వెల్లడించింది. భారత్‌తో సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రిక్తతలు.. ఘర్షణల ఫలితంగా వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల నిర్మాణం.. మోహరింపు అమలుకు దారితీసిన పరిస్థితులను పేర్కొంది. దీంతోపాటు సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే చైనా పశ్చిమ హిమాలయాల్లో మారుమూల ప్రాంతాల్లో విదేశీ చొరబాట్ల గురించి అత్యంత వేగంగా సమాచారం అందజేయడం.. భద్రత కోసం ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించింది.
దీని వల్ల 'PLA ఫీల్డ్ కమాండర్లు.. రియల్-టైమ్ ISR(ఇంటెలిజెన్స్.. నిఘా.. పర్యవేక్షణ), పరిస్థితి గురించిన సమాచారం, నిర్ణయాత్మక ప్రక్రియలను క్రమబద్ధీకరణ, వేగంగా స్పందించడానికి అవసరమైన కమ్యూనికేషన్ చైనా చేరుతుందని' నివేదికలో పేర్కొంది. చైనా విదేశీ ప్రయోజనాలు.. విదేశాంగ విధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి పీపుల్ లిబరేషన్ ఇలాంటి టాస్క్ లను చేస్తోందని నివేదికలో పేర్కొంది.
కరోనా తర్వాత మనసబారిన చైనా ప్రతిష్టను చాటుకోనేలా ఆదేశం దూకుడుగా వెళుతుంది. దీనిలో భాగంగానే సముద్ర జలాలు.. సమృద్ధిగా ఉన్న చమురు.. గ్యాస్ నిక్షేపాల విషయంలో సరిహద్దు దేశాలతో మొండిగా వెళుతూ వివాదాలను తెరలేపుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా భారత్, చైనా మధ్య గతేడాది మే నుంచి నుంచి సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి సమయంలోనే చైనా పశ్చిమ హిమలయాల్లో ఫైబర్ ఆప్టిక్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ పేర్కొనడం సంచలనంగా మారింది.