Begin typing your search above and press return to search.
అమెరికా దుర్మార్గాన్ని చెప్పేసిన పెంటగన్
By: Tupaki Desk | 26 May 2017 8:24 AM GMTఅగ్రరాజ్యమైన అమెరికాను పలువురు అదే పనిగా తప్పు పడతారు. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా తీరు ఏమాత్రం సరిగా ఉండదని, పెద్దన్న మాదిరి ఫోజు కొడుతూ మానవహక్కుల హననానికి పాల్పడుతుందన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అన్నింటికి మించి.. ఉగ్రవాదం మీద యుద్ధం పేరుతో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల ఆరాచకాన్ని పలువురు ప్రశ్నిస్తుంటారు. రక్తదాహంతో అమెరికా చేసే దాడులు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో సాధారణ పౌరుల్ని కూడా పెద్ద ఎత్తున మరణిస్తుంటారన్న విమర్శ ఉంది.
ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న మయాదీన్.. మోసుల్ నగరాలపై బుధ.. గురువారాల్లో జరిపిన యుద్ధ విమానాల దాడిలో సుమారు 50 మందికి పైగా పౌరులు మరణించి ఉంటారంటూ సిరియా మానవహక్కుల పరిశీలన సంస్థ వెల్లడించగా.. అది నిజమేనన్న విషయాన్ని అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్ కూడా ఒప్పుకోవటం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి మే 23 మధ్య కాలంలో సంకీర్ణ దళాలు జరిపిన బాంబు దాడుల్లో మరణించిన సాధారణ ప్రజలు 225 మంది వరకూ ఉంటారని తెలుస్తోంది. 2014 నుంచి ఐసిస్ ఆక్రమిత సిరియా.. ఇరాక్ ల మీద యుద్ధం చేస్తున్న సంకీర్ణ దళాలు ఇప్పటివరకూ 8వేల మందిని చంపేయగా.. వీరిలో 6వేల మంది ఉగ్రవాదులు కాగా.. 2వేల మంది అమాయకపౌరులు కావటం గమనార్హం. ఉగ్రవాదుల్ని ఏరివేసే క్రమంలో అమాయకులు పెద్ద ఎత్తున మరణించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ.. రక్తదాహానికి బ్రేకులు పడేదెన్నడో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/