Begin typing your search above and press return to search.

వైసీపీలో ఇలా కూడా నిధులొచ్చేలా లేవే...!

By:  Tupaki Desk   |   4 Dec 2022 3:38 AM GMT
వైసీపీలో ఇలా కూడా నిధులొచ్చేలా లేవే...!
X
వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. చాలా వ‌ర‌కు జిల్లాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం క‌నిపిస్తోంది.

చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఎమ్మెల్యేల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు మంత్రుల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. అనంత‌పురం, క‌ర్నూలు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ నేత‌లు చేస్తున్న పాద‌యాత్ర‌లు తేలిపోతున్నాయి.

కొన్ని కొన్ని చోట్ల ప్ర‌జ‌లు ఏకంగా త‌లుపులు వేసుకుంటుంటే.. మ‌రికొంద‌రు నేత‌ల‌ను గ‌ట్టిగానే నిల‌దీ స్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆయా నేత‌లు ఖంగుతింటున్న ప‌రిస్థితి వ‌స్తోంది. ఇక‌, తాము చేస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మానికి సంబంధించి అధిష్టానానికి స‌మ‌ర్పిస్తున్న నివేదిక‌ల్లో నాయ‌కులు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అభివృద్ధి నిధులు ఇవ్వాల‌ని మ‌రికొంద‌రు కోరుతున్నారు.

అయితే, ప్ర‌భుత్వం కానీ, పార్టీ కానీ ఆయా నేత‌ల‌కు ఒక విష‌యాన్ని స్ఫ‌ష్టం చేస్తోంది. పార్టీ ప‌రంగా దూకుడు పెంచాల‌ని, వ్య‌తిరేక‌త ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కాలేద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వ‌ర‌కు ఇలాంటి స‌మ‌స్యే ఉంద‌ని పేర్కొంటోంది. ఇప్ప‌టికిప్పుడు నిధులు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు తామే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి కృషి చేస్తామ‌ని దీనిపై ఎవ‌రూ చింతించాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీ చెబుతోంది.

ఇక‌, సీఎంవో వ‌ర్గాలు కూడా ఇప్ప‌టికిప్పుడుకాదు.. త్వ‌ర‌లోనే ఒక మాస్ట‌ర్ ప్లాన్ ఉంది.. దాని ప్ర‌కారం రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేయ‌నున్నామ‌ని జిల్లాల‌కు స‌మాచారం చేర‌వేస్తోంది. అయితే.. అభివృద్ధి విష‌యంలో ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌ల‌కు తాము జ‌వాబు ఇవ్వ‌లేక పోతున్నామ‌నే ఆవేద‌న నాయకుల్లో క‌నిపిస్తోంది.

వెర‌సి.. రాష్ట్రంలో నేత‌లు ఈ రూపంలో అయినా నిధులు తెచ్చుకుందామ‌నే ప్ర‌య‌త్నానికి అధిష్టానం గండికొట్టింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.