Begin typing your search above and press return to search.

సంచలనం: లాక్ డౌన్ పై తిరగబడ్డ ప్రజలు

By:  Tupaki Desk   |   18 April 2020 8:50 AM GMT
సంచలనం: లాక్ డౌన్ పై తిరగబడ్డ ప్రజలు
X
భారత ప్రధాని నరేంద్రమోడీ కరోనా రాకముందే మేల్కొని దేశంలో లాక్ డౌన్ విధించి 130 కోట్ల మంది ప్రజలను కాపాడారు. కానీ ట్రంప్ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను బలిపెట్టలేక లాక్ డౌన్ మొదట విధించకుండా దేశ ప్రజలనే బలిపెట్టారు. ఫలితం ఇప్పుడు కరోనా కేసులు అమెరికాలో 7 లక్షలు దాటాయి. 36వేలమందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటికీ ట్రంప్ కు లాక్ డౌన్ విధించడం ఇష్టం లేకున్నా పెరుగుతున్న మరణాల దృష్ట్యా అమెరికా వ్యాప్తంగా విధించేశారు.

అయితే ట్రంప్ నిర్ణయంపై అమెరికా నిరసన వ్యక్తమవుతోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధింపుకు మద్దతు దక్కుతుండగా... పశ్చిమాన కరోనా తక్కువగా ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంతోపాటు కరోనా లేని రాష్ట్రాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి.

తాజాగా పశ్చిమ రాష్ట్రమైన కాలిఫోర్నియాలోని హన్ టింగ్ టన్ బీచ్ లో వందలాది మంది నిరసనకారులు రోడ్డెక్కారు. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం విధించిన సోషల్ డిస్టేన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆలింగనం చేసుకుంటూ స్టే ఎట్ హోం ఆదేశాలు ఉపసంహరించాలంటూ డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు తక్షణం లాక్ డౌన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఇక అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాకు లాక్ డౌన్ తో తీవ్రనష్టమని.. లాక్ డౌన్ కు వెనుకాడుతున్నారు. ఇప్పుడు ప్రజల ఆందోళనతో ఆయనకు మద్దతు లభించినట్టైంది. ఈ నిరసనలు ట్వీట్ చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రజల నిరసనల ప్రకారం లాక్ డౌన్ ఎత్తివేయాలని గవర్నర్లకు సూచించారు. మిన్నెసోటా - మిచిగాన్ - వర్జీనియా - నార్త్ కరోలినా - కెంటకీ రాష్ట్రాల్లో ఆందోళనకు మద్దతిస్తూ ట్వీట్ చేశారు. విశేషం ఏంటంటే రాష్ట్రాల్లో లాక్ డౌన్ తీసేసే అధికారం ట్రంప్ కు లేదు. పైగా ఈ రాష్ట్రాలన్నీ తమ ప్రత్యర్థి ప్రతిపక్ష మైన డెమొక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్ల పాలనలో ఉన్నాయి. అందుకే తాజాగా ఈ రాష్ట్రాల్లో లాక్డౌన్ నిరసనలకు ట్రంప్ మద్దతు పలుకుతూ ఆంక్షలు ఎత్తివేయాలని ట్వీట్ చేయడం విశేషం.

ఇలా లాక్ డౌన్ విధింపుతోనే కరోనా కట్టడి అవుతుందని తెలిసినా ట్రంప్ దాన్ని విధించడానికి వెనుకాడుతుండడం.. అమెరికన్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తుండడం.. కొందరు ట్రంప్ కు మద్దతుగా.. వ్యతిరేకంగా తయారు కావడం హీట్ పెంచింది. చూస్తుంటే అమెరికాలో ఎన్నికల వేడి అప్పుడు మొదలైందని.. దీన్ని ట్రంప్ క్యాష్ చేసుకుంటున్నాడని చెప్పవచ్చు.