Begin typing your search above and press return to search.
పేకాటకు చెక్ పెట్టేందుకు వెళ్లిన ఎస్ ఐని ఊరికించి మరీ దాడి
By: Tupaki Desk | 12 April 2022 12:30 AM GMTఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మాదిరి కాకుండా ఇటీవల కాలంలో నేరస్తులు రెచ్చొపోతున్న వైనం బిహార్ న తలపించేలా మారుతోంది. మొన్నటికి మొన్న వైద్యం చేసిన డాక్టరమ్మ ఫీజు అడిగితే.. లేపేస్తామంటూ భారీ వార్నిగ్ ఇచ్చిన వైనం మరిపోక ముందే.. తాజాగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు తనిఖీలు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన ఎస్ ఐను ఆయన సిబ్బంది పైన దాడికి పాల్పడిన సిత్రం ఏపీలో చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో పోలీసులకు అనూహ్య ఘటన ఎదురైంది. పేకాట.. కోడి పందాలు ఆడుతున్న వైనం గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు యడవల్లికి వెళ్లారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లినంతనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఏఎస్ఐతో పాటు మరికొందరు పోలీసులు ఈసారి వెళ్లారు. దుర్భాషలు ఆడిన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
దీనికి ప్రతిగా గ్రామస్థులు పోలీసులపై తిరగబడటంతో.. పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో ఎస్ఐకు సమాచారం అందించారు. దీంతో.. యూనిఫాంలో వెళ్లిన ఎస్ఐకు స్థానికులకు మధ్య వాదన చోటు చేసుకుంది.
ఘర్షణకు దారి తీస్తుందన్న విషయాన్ని గుర్తించి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. దీంతోరంగంలోకి దిగిన ఎస్ఐ.. యూనిఫాంలోనే గ్రామానికి చేరుకున్నారు. ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. ఎస్ఐతో పాటు పోలీసులపై తిరగబడ్డారు.
రోడ్డు మీదఎస్ఐను పోలీసులను పరిగెత్తిస్తూ.. చొక్కా లాగేసి మరీ కొట్టిన వైనం షాకింగ్ గా మారింది. గ్రామస్థుల దాడితో ఎస్ఐకు గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు కక్షతోనే ఎస్ఐ దుర్గామహేశ్వరరావుపై ప్లాన్ చేసి దాడి చేసినట్లుగా గుర్తించామని చెబుతున్నారు.
దాడికి పాల్పడిన పలువురిని గుర్తించామని.. త్వరలో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఏమైనా.. చేసేది తప్పుడు పని అయినప్పటికీ అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.