Begin typing your search above and press return to search.

క‌ర్నాట‌క‌లో విడ్డూరం..క‌రోనా వ‌స్తుంద‌ని నోట్లు కాల్చేశారు

By:  Tupaki Desk   |   12 April 2020 6:18 AM GMT
క‌ర్నాట‌క‌లో విడ్డూరం..క‌రోనా వ‌స్తుంద‌ని నోట్లు కాల్చేశారు
X
క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఏ రూపంలో ఆ మ‌హమ్మారి వ్యాపిస్తోంద‌నే భ‌యంతో ప్ర‌జ‌లు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు తాము స్వీయ‌ర‌క్ష‌ణ పాటిస్తూనే వ్యాధి ల‌క్ష‌ణాలు - సోకే విధానాలు తెలుసుకుని వాటి నుంచి దూరంగా ఉంటూ జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో నోట్ల ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తుంద‌ని ప్ర‌చారం సాగ‌డంతో క‌ర్నాట‌క‌లో కొంద‌రు న‌గ‌దును కూడా త‌గ‌ల‌బెట్టేసిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. రోడ్డుపైన ప‌డిన నోట్ల‌ను ముట్టుకోకుండా వాటిని ముట్టుకోకుండా క‌ట్టెతో ఒక‌చోట‌కు చేర్చి కాల్చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. క‌ర్నాట‌క‌లోని కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో ముఖానికి మాస్క్‌ వేసుకొని ముగ్గురు వ్యక్తులు వ‌చ్చారు. కొద్దిసేపు వ‌ర‌కు మొబైల్‌ లో ఎవ‌రితోనో మాట్లాడారు. ఆ కొద్దిసేప‌టికి నోట్లు పారవేసి వెళ్లారు. దీన్ని గుర్తించిన ఆ గ్రామ మహిళలు అప్ర‌మ‌త్తమ‌య్యారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే వారు ఆ నోట్లు ప‌డేసి వెళ్లార‌ని.. ఒక‌వేళ క‌రోనా బాధితులు అయ్యి ఉంటే? అని అనుమానంతో వెంట‌నే పిల్ల‌ల‌ను ముట్ట‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. పిల్ల‌ల‌కు దూరం పెట్టి ఆ నోట్ల‌ను మట్టితో మూయించారు. కొద్దిసేప‌టికి గ్రామ‌స్తులంద‌రికీ సమాచారం అందించారు. ఆ తరువాత గ్రామస్తులంతా క‌లిసి ఆ నోట్లను మ‌ట్టిలో నుంచి తీసి కాల్చివేశారు. ఈ విధంగా క‌రోనా భ‌యంతో ప్ర‌జ‌లు డ‌బ్బును కూడా లెక్క‌చేయ‌డం లేదు. అయితే గ్రామ‌స్తులు తీసుకున్న నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌రోనా ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌ని కొంద‌రు అభినందిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు భ‌యంతో పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ప‌ట్ట‌ణాల్లో క‌న్నా గ్రామాల్లోనే ప్ర‌జ‌లు క‌రోనాపై అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం విశేషం.