Begin typing your search above and press return to search.

మందు కావాలంటే చుక్క పెట్టించుకోవాల్సిందే !

By:  Tupaki Desk   |   8 May 2020 6:30 AM GMT
మందు కావాలంటే చుక్క పెట్టించుకోవాల్సిందే !
X
దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా మూసిన మద్యం దుకాణాలు ...కేంద్రం లాక్ డౌన్ నియమాలలో ఇచ్చిన సడలింపుల కారణంగా మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే , దాదాపు 40 రోజుల తరువాత మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతో మందుబాబులు మొత్తం మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. మొత్తం దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కరోనా సోకే ప్రమాదం ఉంది సామజిక దూరం పాటించాలని చెప్తున్నా కూడా ఎవరు పాటించడం లేదు.

ఈ తరుణంలో మందుబాబులను గుర్తించేందుకు మధ్యప్రదేశ్ ‌లోని హోషంగాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న విధానాన్ని అవలంభిస్తోంది. మద్యం కొనేవారి చేతి వేలిపై ఇంకు చుక్క పెడుతున్నారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి అభిషేక్‌ తివారి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సర్కారు మద్యం విక్రయాలు ప్రారంభించింది. హోషంగాబాద్ జిల్లాలో మద్యం కొనుగోలుదారుల పేర్లు, వారి చిరునామాలు, మొబైల్ ఫోన్ నంబర్లను మద్యం షాపుల వద్ద రిజిస్టర్ చేయించుకొని, మద్యం కొన్న వారి చేతి వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించారు.

ఒకసారి మద్యం కొన్న వారు మళ్లీ మళ్లీ దుకాణానికి రాకుండా రద్దీని నివారించేందుకు తాము వేలిపై సిరా గుర్తు పెట్టే పద్ధతి చేపట్టామని హోషంగాబాద్ జిల్లా ఎక్జైజ్ శాఖ అధికారి అభిషేక్ తివారీ చెప్పారు. నాన్ కంటైన్మెంటు జోన్లలో 50 మద్యం దుకాణాలకు అనుమతించామని, మందుబాబుల రద్దీని నివారించేందుకు కొనుగోలుదారులకు సిరాగుర్తు పెట్టే పద్ధతి అమలు చేస్తున్నామని తివారీ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాల కోసం ఈ టోకెన్ ను సర్కారు జారీ చేయాలని నిర్ణయించింది. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా నివారించేందుకు వీలుగా ఈ టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించడం తో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిన సంగతి తెలిసిందే.