Begin typing your search above and press return to search.
కరోనా భయంతో ఆ మందు తాగారు.. 300మంది దుర్మరణం
By: Tupaki Desk | 27 March 2020 6:30 PM GMTకరోనా వైరస్ ఇరాన్ లో మరణ మృదంగం వినిపిస్తోంది. జనం పిట్టల్లా రాలుతున్నారు. భయానక పరిస్థితులు ఆ దేశంలో ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ప్రజలు ఇండస్ట్రియల్ ఆల్కాహాల్ 'మెథనాల్'ను తాగడంతో 300మంది మరణించారు. మరో 1000 మందికి పైగా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇరాన్ లో అల్కహాల్ పై నిషేధం అమల్లో ఉంది. కరోనాకు విరుగుడు అంటూ సోషల్ మీడియాలో 'మెథనాల్' తాగాలని సూచించడంతో జనమంతా ఎగబడ్డారు. ఈ ద్రావణం తయారు చేసుకొని తాగడంతో ఈ మరణాలు సంభవించాయి. ఇరాన్లో పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం సాగింది. 'విస్కీ, తేనె కలిపి సేవిస్తే కరోనా వైరస్ నుంచి బయటపడుతారని' సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీంతో దీన్ని కూడా ప్రజలంతా తాగేశారు. అది వికటించి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వందల మరణాలు సంభవించాయి.
అల్కహాల్ తో హ్యాండ్ శానిటైజర్లు తాగితే వైరస్ చనిపోతుందని భావించి 'మెథనాల్'ను పెద్ద ఎత్తున తాగారు. దీంతో మెదడుకు ప్రమాదం వాటిల్లి కోమాలోకి పోయి చాలామంది చనిపోయారు.
ప్రజలు కరోనా భయంతో ఇలా సోషల్ మీడియాలో ప్రచారమైన తప్పుడు వార్తలను నమ్మి మెథనాల్ తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పటికే 300మంది చనిపోగా ఇంకా మరణాలు పెరిగే చాన్స్ ఉందని సమాచారం.