Begin typing your search above and press return to search.
ప్రజల వద్దకు పాలన భ్రష్టు పట్టిందిగా జగనన్నా!
By: Tupaki Desk | 18 Oct 2022 8:30 AM GMTరాష్ట్రంలో గ్రామీణ భారతాన్నిముందుండి నడిపిస్తున్నామని.. పదే పదే చెప్పుకొనే వైసీపీ సర్కారు.. కీలకమైన సర్పంచ్ వ్యవస్థను సన్నగిల్లేలా చేసింద నే వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ.. వైసీపీకి అనుకూలమైన వారే చక్రం తిప్పుతున్నారు. అయితే.. సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు కావస్తోంది. పంచాయతీలను అభివృద్ధి చేయాలని కొంత మంది సర్పంచ్‌లు ఎన్నో కలలు కన్నారు. అయితే సర్పంచ్ అయ్యాక తత్వం బోధపడింది.
తొలుత కొద్దిరోజులు చెక్‌పవర్ ఇవ్వడంలో జాప్యం కావడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో తమను కలిసేందుకు వచ్చిన వారికి త్వరలోనే పనులు చేస్తాం.. అని చెప్పుకొన్నారు.
అయితే.. చెక్ పవర్ ఇచ్చారు కానీ, నిధుల విషయం మాత్రం పక్కదారి పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడం పంచాయతీల ఖాతాల్లో నిధులు లేకపోవడంతో కనీస వసతులు తీర్చలేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడ్డారు. దీంతో చాలా మంది సొంత నిధులు వెచ్చించి పైప్‌లైన్లు, మోటరు రిపేర్లు, శానిటైజరు ఇతరత్రా వాటికి ఖర్చు చేశారు.
ఆర్థిక సంఘం నిధులు వస్తే తాము చేసిన పనులకు బిల్లులు పెట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో సొంతంగా కొందరు పెట్టుబడి పెట్టేశారు. అయితే కేంద్రమిచ్చే నిధులన్నీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. కనీసం ఈసారి అయినా పంచాతీల్లో మౌలిక వసతులు కల్పిద్దామనుకుంటే వచ్చిన నిధుల్లో కరెంటు చార్జీలకు 60శాతం చెల్లించాలని చెప్పడంతో సర్పంచ్‌ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
సీఎం జగన్ సొంత జిల్లా కడపకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.33 కోట్లను ఇచ్చింది. దీనిలో దాదాపు రూ.20 కోట్ల మేర కరెంటు బిల్లులకు చెల్లించాల్సి వస్తుందని సర్పంచ్‌లు వాపోతున్నారు.
మరి ఆయన జిల్లాలోనే అలానే ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న. గ్రామీణ భారతాన్ని గాడిలో పెడతామని పదే పదే చెప్పిన జగన్.. ఇప్పుడు ఇలా వ్యవహరించడం.. ప్రజల వద్దకు పాలనను చేరువ చేసే సర్పంచులను పక్కన పెట్టడం వంటివి.. విస్మయానికి గురి చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా.. నిధులు ఇస్తారో లేదో చూడాలి. ఎందుకంటే.. మరోఏడాదిలో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో.. ప్రభుత్వ అనుకూలత దెబ్బతినడం ఖాయమని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.