Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌లో 20 శాతం మందికి నిద్రలేమి సమస్య
By: Tupaki Desk | 17 Jun 2022 2:30 AM GMTనైట్ షిఫ్టులు, లేట్ అవర్స్‌లో వర్కింగ్, ఓవర్ టైం వంటి కారణాలతో నగర ప్రజల్లో నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి. వివిధ పనుల వల్ల నిద్రను పోస్ట్‌పోన్ చేయడమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య 15 నుంచి 20 శాతానికి పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో నిద్రలేమి సమస్య బాధితులు పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సమస్యతో బాధపడుతున్న వారు 15 నుంచి 20 శాతం పెరిగారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య గల వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం, పనిచేసే సమయం పెరగడం, నైట్ షిఫ్టులు వంటి కారణాలతో నిద్రను వాయిదా వేయడం వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో అధిక శాతం మంది నిద్రను వాయిదా వేస్తున్నారని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
వీరిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉండటం గమనార్హం. వర్క్ ఫ్రం హోం మొదలైనప్పటి నుంచి ఐటీ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ పెరిగాయి. షిఫ్టులతో సంబంధం లేకుండా లేట్ నైట్ వరకు పనిచేయడం వల్ల వీరిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. 'వర్క్ ఫ్రం హోం మొదలైన తర్వాత ఆఫీసులో చేసే పని కంటే రెండింతలు ఎక్కువ ఇస్తుండడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం లాగిన్ అయితే అర్ధరాత్రి దాకా మీటింగ్స్, క్లైంట్ కాల్స్ తోనే సరిపోతోంది. ఒక్కోసారి షిఫ్ట్ టైంకు మించి పనిచేయాల్సి వస్తోంది.
ముఖ్యంగా యూఎస్, యూకే బేస్డ్ కంపెనీలతో కలిసి పనిచేసే వాళ్లు వర్క్ ఫ్రం హోంను మరింత ప్రెజర్గా ఫీలవుతున్నారు. ఈ షిఫ్టులు చేసేవారు అర్ధరాత్రి 2 గంటల వరకు, తెల్లవారుజాము వరకు మేల్కొని పనిచేస్తున్నారు. దీంతో నిద్ర ను ఆపుకోవడం తప్పనిసరి అవుతోంది.' అని ఓ ఐటీ ఉద్యోగులు తెలిపారు.
2020 ఆగస్టులో అంతర్జాతీయంగా బెడ్ టైం ప్రొక్రాస్టియేషన్పై స్విట్జర్లాండ్ కి చెందిన ఈఎన్టీజే ఎన్విరాన్ రెస్ పబ్లిక్ హెల్త్ చేసిన స్టడీలో కూడా దాదాపు 70 శాతం మంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారని తేలింది. ఇటీవల గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 సర్వే రిపోర్టులో కూడా హైదరాబాద్‌లో అధిక శాతం మంది నిద్రను మరుస్తున్నరని తెలిసింది. పని వేళల్లో నిద్ర మత్తుతో బాధపడుతున్న వారి సంఖ్య గత ఏడాది 20 శాతం ఉంటే ప్రస్తుతం అది 49 శాతానికి పెరిగింది. ఇందులో 53 శాతం ఐటీ సెక్టార్‌కి చెందినవారే ఉన్నారు.
'నిద్రలేమి సమస్య దీర్ఘకాలంగా బాధిస్తుంటే తప్పక వైద్యులను సంప్రదించాలి. లేకపోతే ఇది తీవ్రమై అల్జీమర్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే రోజుకు కనీసం 7 గంటలు తప్పక నిద్రపోయేలా చూసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాల. కంటిన్యూగా ఒక నెలంతా నైట్ షిఫ్ట్ చేసి.. మరో నెల డే షిఫ్ట్ చేయాలి. దీనివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అని డా.మేజర్ అలీ, సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్ సూచించారు.