Begin typing your search above and press return to search.
మగ బిడ్డే కావాలంటున్న మన దేశ ప్రజలు!
By: Tupaki Desk | 23 May 2022 3:11 AM GMTదేశంలో మగ బిడ్డే కావాలంటున్న ప్రజల శాతం అంతకంతకూ పెరుగుతోంది. ఆడ పిల్లలు కంటే మగ పిల్లలు కావాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్య (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5) సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. మగపిల్లలు కుటుంబ వారసత్వాన్ని కాపాడాతారని తల్లిదండ్రులు భావిస్తున్నారని సర్వే వివరించింది. అలాగే వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సర్వే తెలిపింది.
ఈ సర్వేను దేశవ్యాప్తంగా 7.24 లక్షల మంది మహిళలు (15-49 ఏళ్ల వయసు), 1.01 లక్షల మంది పురుషులను (15-55 ఏళ్ల వయసు) ఇంటర్వ్యూ చేసి చేశారు. ఇందులో భాగంగా ఏపీలో 10,975 మంది మహిళలు, 1,558 మంది పురుషుల నుంచి సమాచారం సేకరించారు.
2019-21 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 80 శాతం మంది దంపతులు తమకు కనీసం ఒక కొడుకైనా ఉండాలని కోరుకున్నట్టు సర్వే వెల్లడించింది. మేఘాలయ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో మగ పిల్లలు కావాలనే వారి శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. కాగా, అత్యధికంగా మేఘాలయలో 22 శాతం మంది మహిళలు, 12 శాతం మంది పురుషులు తమకు ఎక్కువగా ఆడ పిల్ల కావాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివాహితలు 6.4 శాతం మంది మగ బిడ్డ కావాలని, 3.3 శాతం మంది ఆడ పిల్ల కావాలని కోరుకున్నారని సర్వే తెలిపింది. పురుషుల్లో అయితే 11.4 శాతం మంది కుమారులు, 4.1 శాతం మంది కుమార్తెలు ఉండాలని తెలిపారు.
కాగా, దేశవ్యాప్తంగా అమ్మాయిలు కావాలని కోరుకునే వారి శాతం కూడా గతంలో కంటే పెరగడం విశేషం. అమ్మాయిలు కావాలని 2015-16 నాటి సర్వేలో 4.9 శాతం మంది కోరుకున్నారు. ప్రస్తుతం ఆడ పిల్లలు కావాలని 5.17 శాతం మంది కోరుకోవడం విశేషం.
అలాగే దేశంలో తొలిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మంది పురుషులకు 991 మంది స్త్రీలు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు 1,020కి చేరింది. ఏపీలో అయితే 1,000 మంది పురుషులకు 1,021 ఉన్న మహిళల సంఖ్య 1,045కు పెరిగింది. పిల్లల లింగ నిష్పత్తిలో కూడా మెరుగుదల నమోదైంది. గతంలో చిన్నారుల జననాల నమోదులో వెయ్యిమంది మగపిల్లలకు 918 మంది ఆడపిల్లలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 929కి చేరింది.
భవిష్యత్తులో పిల్లలను కనాలనుకునే వివాహిత జంటలు ఆడపిల్లల కంటే మగపిల్లలను పొందాలనే అభీష్టాన్ని వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. మగపిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఆడపిల్లలను కంటున్నవారు కూడా అనేకమంది ఉన్నారు. 15-19 సంవత్సరాల వయసున్న యువతులపై జరిగిన సర్వేలో 65 శాతం మందికి కనీసం ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరు ఇకపై తమకు పిల్లలొద్దని చెప్పారు. ఇటువంటి వారి సంఖ్య గత సర్వేతో పోలిస్తే రెండుశాతం పెరిగింది.