Begin typing your search above and press return to search.
దేశంలో ఒక్క కోవిడ్ డోసు తీసుకోనివారు అన్ని కోట్ల మంది ఉన్నారా?
By: Tupaki Desk | 24 July 2022 8:32 AM GMT2020, 2021 రెండు సంవత్సరాలపాటు ప్రపంచ దేశాలను కోవిడ్ బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. చైనాలోని ఊహాన్ లో మొదలైన కోవిడ్ వైరస్ అనతి కాలంలోనే దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. కోట్ల మంది ప్రజలు దీని బారినపడ్డారు. ముఖ్యంగా మనదేశంతోపాటు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లండ్, జర్మనీ, బ్రెజిల్, రష్యా, టర్కీ, దక్షిణ కొరియా, మెక్సికో, ఆస్ట్రేలియా తదితర దేశాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రపంచవ్యాప్తంగా 57.40 కోట్ల మంది కోవిడ్ బారినపడ్డారు. 64 లక్షల మంది కన్నుమూశారు. ఇక మనదేశంలో 4.40 కోట్ల మంది కరోనా బారిన పడగా 5.26 లక్షల మంది మృత్యవాత పడ్డారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్లను భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు కోవిడ్ వ్యాక్సిన్లను తెచ్చాయి. మనదేశంలో ఇప్పటికే రెండు డోసుల టీకాను పూర్తి చేశారు. బూస్టర్ డోసును కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోనివారు 4 కోట్ల మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. జూలై 18 వరకు ఉన్న గణాంకాల మేరకు దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం వివరించింది.
ఈ మేరకు తాజాగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఇప్పటికే కోవిడ్ రెండు డోసులు 200 కోట్లు దాటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఉచితంగా బూస్టర్ డోసు వేయడానికి చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో 4 కోట్ల మంది ఒక్క డోసూ వేసుకోలేదని కేంద్రం వెల్లడించడం గమనార్హం.
కేంద్రం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 98 శాతం కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా తీసుకున్నారు. 90 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్రం ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తుండటంతో బూస్టర్ డోసు తీసుకునే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.
కాగా కోవిడ్ కేసులు దేశంలో విజృంభిస్తున్నాయి. రోజుకు 20 వేలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.50 లక్షల వరకు ఉన్నాయి.