Begin typing your search above and press return to search.

అనగనగా ఓ గ్రామం..గ్రామ ప్రజలు ఎప్పుడు బట్టలు వేసుకోరు!

By:  Tupaki Desk   |   8 Oct 2020 12:39 PM
అనగనగా ఓ గ్రామం..గ్రామ ప్రజలు ఎప్పుడు బట్టలు వేసుకోరు!
X
మనం ధరించే బట్టలు మన సంస్కృతికి , సాంప్రదాయానికి ప్రతీకలుగా ఉంటాయి. మన శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. గత కొన్ని శతాబ్ధాలుగా దుస్తులు సమాజ సంస్కృతికి అద్ధంపడుతుంటాయి. కానీ బ్రిటన్‌ లోని స్పీల్‌ ప్లాట్జ్ అనే ఓ గ్రామంలో నివసిస్తున్న ప్రజలెవరూ కూడా ఒంటిపై దుస్తులు ధరించారు , నగ్నంగానే ఉంటారు. స్త్రీ , పురుష , యువతి , యువకుడు , చిన్నా , పెద్ద, ముసలి అన్న తేడా ఉండదు అందరూ దుస్తులు వేసుకోకుండానే జీవనం సాగిస్తుంటారు.

ఈ గ్రామం హెర్ట్‌ఫోర్డ్‌షైర్ బికెట్‌వుడ్ సమీపంలో ఉంది. అధునాతన జీవనశైలి, ఆధునిక పోకడలు ఉట్టిపడే ఈ గ్రామంలో పబ్బులు, హోటళ్ళు, మోటల్స్, ఈత కొలనులు వంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. వేసవిలో సందర్శకులకు అద్దెకు ఇచ్చే ఇళ్ళు కూడా ఆధునిక తరహాలో నిర్మించారు. ఇక్కడి ప్రజలు రెండు పడకల బంగ్లాలో నివసిస్తుంటారు. భారీ క్లబ్ హౌస్‌ ను కూడా ఆకర్షణీయంగా నిర్మించుకున్నారు. గ్రామాన్ని సందర్శించే పర్యాటకులు కూడా గ్రామ నియమాలను పాటిస్తూ నగ్నంగానే ఉండాలి.ఇక్కడ ప్రజలు ప్రకృతిలో పూర్తిగా కలిసిపోతారు. బాగా చలిగా అనిపించినప్పుడు దుస్తులు ధరించే స్వేచ్ఛ ఇక్కడి ప్రజలకు ఉంటుంది.

ఐసోల్ట్ రిచర్డ్సన్ అనే వ్యక్తి 1969 లో ఈ గ్రామాన్ని కనుగొన్నాడు. అతడు 1 పౌండ్‌ ధరకు ఇక్కడ 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే కొనే ముందు ఈ గ్రామం గురించిన వింత ఆచారం అతడికి ఏమీ తెలియదు. అయితే , ఈ బట్టలు ధరించని సంప్రదాయం ఎలా ప్రారంభమైందో గ్రామ ప్రజలకు కూడా తెలియదు. సహజ జీవితాన్ని గడపడానికి మాత్రమే వారు బట్టలు వదలిపెట్టారని చాలామంది వాదిస్తారు. మరో ట్విస్ట్ ఏమిటంటే ఒక పర్యాటకుడు ఈ గ్రామాన్ని సందర్శించాలనుకుంటే అతడు పదవీవిరమణ చేసిన తరువాత మాత్రమే ఈ గ్రామంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది.