Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ పొడిగించాలా? వద్దా? ప్రజాతీర్పిది..
By: Tupaki Desk | 9 April 2020 10:50 AM GMTఏప్రిల్ 14 ముంచుకొస్తోంది. దేశంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14వరకు విధించారు. ఆ తర్వాత పరిస్థితేంటి? పొడిగించాలా? వద్దా? కరోనా రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తే జనాలు రోడ్లపైకి వస్తారు.. కరోనా రోగులుంటే వ్యాపించి పెద్దఎత్తున కరోనా వ్యాపిస్తుంది. మరో ఇటలీ కావచ్చు. అందుకే సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు లాక్ డౌన్ దేశంలో పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరేమో.. ఇప్పటికే లాక్ డౌన్ తో ఉద్యోగ - ఉపాధి అవకాశాలు కోల్పోయామని.. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని.. లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు.
అయితే ఎవరి వాదన ఎలా ఉందనే దానిపై తాజాగా ‘తుపాకీ.కామ్’ ఓ సర్వే నిర్వహించింది. ఈ పోల్ లో మెజార్టీ ప్రజలు - నెటిజన్లు లాక్ డౌన్ పొడిగించాలని తీర్పునిచ్చారు.
తుపాకీ సర్వేలో ప్రజలు - విద్యావంతులు - నెటిజన్స్ స్వచ్ఛందంగా లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని కోరుకున్నారు. లాక్ డౌన్ పొడిగించాలని 84.29శాతం మంది ఓటేయగా.. ఇక లాక్ డౌన్ అవసరం లేదని కేవలం 12.12శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.. ఈ రెండు అభిప్రాయాలు కాకుండా ‘ఏమో చెప్పలేం’ అంటూ 3.59శాతం మంది ఎటూ తేల్చుకోలేదు.
తుపాకీలో చేపట్టిన సర్వే ప్రకారం.. సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని జనాలు అంతా బల్లగుద్దీ మరి కరెక్ట్ అంటున్నారు. ప్రధాని మోడీ కూడా కేసీఆర్ సలహాల మేరకు లాక్ డౌన్ పొడిగిస్తేనే దేశం కరోనా నుంచి విముక్తి కలుగుతుందని అనుకుంటున్నారట.. సో మెజార్టీ అభిప్రాయం ప్రకారం లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 తర్వాత కూడా పొడిగించాలన్నమాట..