Begin typing your search above and press return to search.
ఓవైసీకి అసంతృఫ్తి లెక్కేంటో చూపిన ఓల్డ్ సిటీ ఓటర్లు
By: Tupaki Desk | 5 Nov 2018 2:30 PM GMTహైదరాబాద్ పాతబస్తీ...ఈ పేరు చెప్పగానే సహజంగా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం అనేది వెంటనే గుర్తుకు వస్తుంది. ఎన్నికల విషయంలో ఈ ప్రాంతంను ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ లెక్కలోకి వేసుకోవు. ఎందుకంటే - ఇక్కడ ప్రధాన పార్టీలు ఎన్ని సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా..అక్కడి ఓటు ఓల్డ్ సిటీ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం పార్టీకి తప్ప మరే పార్టీకి పడవనే భరోసా కాబట్టి. అదే సమయంలో ఎంఐఎం మాటను ఇక్కడి ప్రజలు జవదాటరని - వారు ఏం చేసినా మద్దతిస్తారని - తమ భావాలను అస్సలు వ్యక్తం చేయరనే టాక్ ఉంది. అయితే, దానికి భిన్నమైన సీన్ తాజాగా చోటుచేసుకుంది. ఎంఐఎం నేతలకు ఊహించని అసంతృప్తి ఎదురైంది. పార్టీ రథసారథి - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అవాక్కయ్యే రీతిలో..స్థానిక ప్రజలు నిలదీశారు. అసదుద్దీన్ ఓవైసీకి రెండు రోజుల కిందట యాకుత్ పుర - చార్మినార్ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా నిరసన సెగ తగిలింది. తాజాగా నాంపల్లిలో అదే పరిస్థితి ఎదురైంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్ సైతం భరిలో దిగిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మజ్లిస్ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షులు - హైదరాబాద్ ఎంపీ అసదీద్దీన్ ఓవైసీకి కూడా నిరసన సెగ తగిలింది. ఏకంగా మీకు ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్నను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి జాఫర్ హుస్సేస్ మేరాజ్ వెంట అసదుద్దీన్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. నాంపల్లిలోని మాన్ గోడ్ బస్తీ - చార్ ఖందిల్ ప్రాంతాల ప్రజలు ఓవైసీని అడ్డుకున్నారు. తమ సమస్యల గురించి నిలదీశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ప్రజలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. 'నాలుగున్నరేండ్ల కిందట మీ పార్టీ అభ్యర్థి ని చూశాం. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాము. మా బస్తీల్లో మంచినీరు - డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. సమస్యల పరిష్కారానికి వాటర్ వర్క్స్ కార్యాలయం చుట్టూ తిరిగాము. స్థానిక కార్పొరేటర్ ను కలిసి పలుమార్లు వివరించాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. కనీసం బస్తీల్లో పర్యటించి తమ సమస్యలు అడిగి తెలుసుకోలేదు. మీ కల్లబొల్లి మాటలు వినే స్థితిలో లేము.. వెంటనే వెళ్లిపోవాలి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీలేక అసదుద్దీన్ తో పాటు పార్టీ అభ్యర్థి వెనుదిరిగారు.
కాగా, తమ ఇలాకా అనుకుంటున్న పాతబస్తీలోనే ఇలాంటి పరాభవం ఎదురవుతున్న నేపథ్యంలో అసదుద్దీన్ అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రతిఘటనలు ఎదురవడంతో ఇద్దరు అభ్యర్థులను కార్యాలయానికి పిలిచి తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలిసింది. 'మీ వల్ల పార్టీ పేరు నాశనమవుతోంది. జాగ్రత్తగా పని చేసుకోండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, ఓవైసీలపై ఓల్డ్ సిటీలో అభిప్రాయం మారుతోందనేందుకు ఇదే తార్కాణం అని వారి రాజకీయ ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.