Begin typing your search above and press return to search.

మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ సొంతం ...పీపుల్స్‌ పల్స్‌ సర్వే !

By:  Tupaki Desk   |   3 Feb 2020 6:05 AM GMT
మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ సొంతం ...పీపుల్స్‌ పల్స్‌ సర్వే !
X
ఢిల్లీ లో ఎన్నికల వేడి యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంది. ఢిల్లీలో ఈసారి ముక్కోణపు పోరు ఉండటంతో ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీ పైనే ఉంది. ఓ వైపు అధికారిక ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉండగా మరోవైపు ఢిల్లీలో వికసించేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ,తమ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో విజయం సాధించి, పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ఒక సర్వే ఫలితాలు ..మరోసారి ఢిల్లీ వాసులు క్రేజీవాల్ కే పట్టం కట్టబోతున్నారు అని తేల్చేశాయి.

ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయం అని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో ఎన్నికల్లో మోదీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు ఎంతమాత్రమూ పనిచేయబోవని హైదరాబాద్‌ కు చెందిన ఈ సంస్థ సర్వే తేల్చి చెప్పింది. ఈ సర్వే వివరాల ప్రకారం.. క్రేజీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ఢిల్లీలో పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబం నెలకు రూ.1500-3000 ఆదా చేయగలుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇక సారి ఎలాగైనా ఢిల్లీ పీఠం పై జెండా ఎగురవేయాలన్న బీజేపీ ఆశలపై ఈ సర్వే నీళ్లు చల్లింది అని చెప్పవచ్చు. ఢిల్లీలో ఒక్కరు కూడా బీజేపీకి విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి ప్రతికూల అంశం అని చెప్పవచ్చు. అలాగే షీలాదీక్షిత్‌ మరణం తరువాత కాంగ్రెస్‌ కూడా ఢిల్లీ లో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్‌ కు మారిందని ఈ సర్వే స్పష్టం చేసింది. అలాగే మరో ముఖ్యమైన విషయం.. ఎన్నార్సీ, సీఏఏ ఈ ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఈ సంస్థ స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈ సర్వే తేటతెల్లం చేసింది. ఇకపోతే ఈ నెల 8వ తేదీన ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.