Begin typing your search above and press return to search.

చైనాలో ఆస్పత్రుల ఎదుట సెలైన్లతో క్యూ కడుతున్న జనం..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 6:30 AM GMT
చైనాలో ఆస్పత్రుల ఎదుట సెలైన్లతో క్యూ కడుతున్న జనం..!
X
కరోనా మహ్మమారి ప్రపంచానికి పరిచయమై మూడేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం నాలుగో ఏడాదిలో కరోనాతో ప్రజలు సహజీవనం చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ లో కరోనా పేరు చెబితేనే ప్రజలు భయపడిపోయారు. అప్పటి వరకు కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

ఈ నేపథ్యంలోనే కరోనా మరణాలు కూడా ఈ సమయంలో పెద్దసంఖ్యలో జరిగాయి. ఆ తర్వాత కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పరిస్థితిలో మార్పులు వచ్చింది. ప్రజలు సైతం కరోనా జాగ్రత్తలు పాటించారు. మాస్కులు ధరించడం.. శానిటైజర్లు వాడటం.. భౌతిక దూరం పాటించడం వంటి వాటితో పాటు కరోనా సోకితే హోం ఐసోలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నారు.

వైద్యుల కృషి.. ప్రజల జాగ్రత్తల మూలంగా కరోనా మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ ఆయా దేశాల్లో విరివిగా అందుబాటులోకి రావడంతో ప్రజలంతా టీకాలు వేయించుకున్నారు. సమష్టి కృషి ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అన్ని దేశాలు లాక్డౌన్లను ఎత్తివేయడంతో పరిస్థితి మళ్లీ మామూలు స్థితికి వచ్చింది.

అయితే చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే చోట విజృంభిస్తుండటం అందరినీ కలవరానికి గురైంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చైనా ఈ వైరస్ ను బాగానే కట్టడి చేసింది. జీరో కోవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేసి కొద్దిరోజుల్లోనే కట్టడి చేసింది.

ఆ సమయంలో చాలా దేశాలు కోవిడ్ ను లైట్ తీసుకోవడంతోపాటు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆ తర్వాత కరోనా తీవ్ర తీసుకొని అన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. ఇదే సమయంలో కరోనాకు మందు రావడంతో ప్రస్తుతం పరిస్థితి మూములు స్థితికి వచ్చింది. అయితే చైనాలో మాత్రం కొద్ది రోజుల్లో లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీరో కోవిడ్ ఆంక్షలను సడలించింది. అయితే 15 రోజులు గడవక ముందే చైనాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒమ్రికాన్ వేరియంట్ అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీజీంగ్ సహా ప్రధాన నగారాల్లోని ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిట లాడుతున్నాయి.

ప్రజలు తమ వంతు కోసం క్యూ లైన్లలో ఆస్పత్రులు బారులు తీరుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. మరికొందరైతే జ్వరం.. జలుబు.. ఇతర అనారోగ్య సమస్యలతో క్లినిక్కుల ముందే సెలైన్ బాటిళ్లతో దర్శనమిస్తున్నారు. చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్లే భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని అర్థమవుతోంది.

అయితే జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలు చేయడం వెనుక విదేశీ హస్తం ఉందని ఫ్రాన్స్ లోని చైనా రాయబారి లు షాయ్ తాజాగా పేర్కొన్నారు. చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిరోజు మాత్రం అసలైన ఆందోళనలు జరిగాయని తెలిపారు. దీనిని ఆసరా చేసుకుని కొన్ని విదేశీ శక్తులు చైనాలో ప్రజలను రెచ్చగొట్టి జీరో కోవిడ్ విధానం ఎత్తివేసేలా ప్లాన్ చేశాయని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా చైనాలో వరదలా పెరుగుతున్న కరోనా కేసుల ప్రపంచాన్ని మరో భయాందోళనలకు గురి చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.