Begin typing your search above and press return to search.
ఆ ఒక్క మాట ఎవరినైనా అని చూస్తే..?
By: Tupaki Desk | 7 Dec 2015 10:30 PM GMTఒక్క మాట. అది కూడా ఎవరిని నొప్పించని ఒకే ఒక్క మాట అంటే.. వారి స్పందన ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచన ఒకరికి వచ్చింది. ఆ పని చేశారు. వచ్చిన ఫలితం అమోఘం. ఇంతకీ ఆ ఒక్క మాట ఏమిటనా? సింఫుల్.. చాలా చిన్న మాట. అదే.. ‘‘మీరు అందంగా ఉన్నారు’’ అని. ఆ మాట ఎలా అంటాం? అందరూ అందంగా ఎలా ఉంటారన్న ప్రశ్న వినిపిస్తుంటుంది. కానీ.. ఆలోచించి చూస్తే.. అందరూ అందంగానే కనిపిస్తారు. అదెలా అంటారా..?
పుట్టిన ప్రతి పాపాయి చాలా.. చాలా అందంగా ఉంటుంది. కాదంటారా? ఈ లోకంలోకి అడుగు పెట్టినా.. తన లోకంలోనే విహరించే చిన్నారిలోని అమాయకత్వంలో ఎంత అందం ఉంటుంది? పుట్టుకతో వచ్చే అందం వారి జీవితాంతం వెంటే ఉంటుంది. కానీ.. చూసే కళ్లల్లోనే తేడా. అందుకే.. కొందరు మాత్రమే అందంగా ఉందని భావిస్తారు.
మీ అమ్మను.. నాన్నను మీ కళ్లు ఎప్పుడూ అందంగానే చూపిస్తాయి. అంతదాకా ఎందుకు.. మీకు నచ్చిన.. మీరు ప్రేమించే వ్యక్తి మీకు చాలా.. చాలా అందంగా అనిపిస్తారు. మరి.. అదే ప్రేమ చుట్టూ ఉన్న వారితోనూ చూసినప్పుడు.. అందరూ అందంగానే కనిపిస్తారు. ఇలాంటి ఆలోచనతో స్టూడెంట్ కమ్ ఫోటోగ్రాఫర్ అయిన పీయూ గ్లోవర్ ఒక ప్రయోగం చేసింది.
తన సహచర విద్యార్థులు.. ఉపాధ్యాయుల ఎదుటకు వెళ్లి.. వారితో.. ‘‘మీరు అందంగా ఉన్నారు’’ అని వెంటనే తన కెమేరాను క్లిక్ చేసింది. మరి.. ఆమె ఆ మాట అన్న వెంటనే.. ఆ మాట విన్న వారు ఎలా స్పందించారు? వారి ఫీలింగ్స్ ఏమిటి? లాంటివి మాటలతో చెప్పే కన్నా.. సింఫుల్ గా 4.47 నిమిషాలున్న ఈ చిట్టి వీడియోను చూస్తే చాలా బాగుంటుంది. అంతేకాదు.. బోలెడన్ని అనుభూతుల్ని ఈ కాస్త సమయం వెచ్చించినందుకు సొంతం చేసుకోవచ్చు. నిజం కాదని అనుకోవచ్చు. కానీ.. వీడియో ప్లే చేసి చూస్తే.. మా మాటల్లో నిజం ఎంతో మీకు వీడియో పూర్తయ్యాక అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.
ఇదే ఆ వీడియో..
https://www.youtube.com/watch?v=aW8BDgLpZkI