Begin typing your search above and press return to search.
వ్యక్తి ప్రాణం కంటే ఉల్లి ముఖ్యమని చెప్పేశారు!
By: Tupaki Desk | 3 Nov 2018 10:54 AM GMTమనిషిలోని మానవత్వం అంతకంతకూ తగ్గిపోతుందా? సాటి మనిషి గురించి ఆలోచించటం మానేసి.. మానవత్వాన్ని వదిలేసి.. ఎవరి స్వార్థం వారిదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న తాజా ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. మరీ ఇంత దారుణమా? అన్న భావన కలగటం ఖాయం.
ఇంతకీ జరిగిందేమంటే.. గురువారం ఉదయం పుణె నుంచి ఉల్లిపాయల లోడుతో ముంబయి వెళుతున్న ఒక ట్రక్కు లోనావ్లా ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. వంతెన మీద నుంచి వెళుతున్న ట్రక్కు అదుపు తప్పి వంతెన మీద నుంచి ఫుణె-ముంబయి పాత హైవేపై పడింది. ఈ ఉదంతంలో ట్రక్కు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న డ్రైవర్ మీద కంటే కూడా ట్రక్కులో నుంచి పడిపోయిన ఉల్లిపాయల మీద అందరి దృష్టి పడింది.రోడ్డు మీద పడిపోయిన ఉల్లిని ఏరుకునే విషయంలో బిజీబిజీగా ఉన్న వారు.. దొరికినన్న ఉల్లిని తమతో ఎత్తుకెళ్లారు.
ట్రక్కు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేసరికి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న డ్రైవర్ ను వదిలేసి.. ఉల్లిని ఏరుకోవటంలో బిజీగా ఉండటాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉల్లి కోసం విలువైన ప్రాణాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లోకి మనిషి వెళ్లిపోవటం ఏమిటి?