Begin typing your search above and press return to search.

రోహిత్ వేముల కుల వివాదంః ఆరుగురిపై వేటు!​

By:  Tupaki Desk   |   18 April 2016 4:58 AM GMT
రోహిత్ వేముల కుల వివాదంః ఆరుగురిపై వేటు!​
X
సెంట్రల్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్‌ వేముల రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన కులాన్ని నిర్ధారణ చేసుకునేందుకు ద‌ర్యాప్తు జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు తమ ముందు విచార‌ణ‌కు హాజరు కావాలని జాతీయ ఎస్‌ సి - ఎస్‌ టి కమిషన్‌ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే ఢిల్లీలో విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

2007 - 2015లో రోహిత్‌ ను ఎస్‌ సీగానే నిర్ధారిస్తూ రెవెన్యూ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అయితే అతని సోదరుడు చైతన్య కుమార్‌ 2015లో బీసీ సర్టిఫికెట్‌ పొందారు. రోహిత్‌ ఆత్మహత్య తరువాత విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం గుంటూరు జిల్లా అధికారులను, రోహిత్‌ తండ్రి - తాతలను విచారించగా అతను బీసీగానే నిర్ధారించింది. ఈ తరుణంలో జాతీయ ఎస్‌ సి - ఎస్‌ టి కమిషన్‌ కు జిల్లా కలెక్టర్‌ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. రోహిత్‌ దళితుడేనని నిర్ధారిస్తే కేంద్ర మంత్రులు దత్తాత్రేయ - స్మృతి ఇరానీలు ఇరకాటంలో పడతారు. ఒకవేళ అతను బిసి అని నిర్ధారిస్తే రెవెన్యూ శాఖలో ఇద్దరు వీఆర్‌ ఒలు - ఇద్దరు ఆర్‌ ఐలు - మరో ఇద్దరు తహశీల్దార్లు మొత్తం ఆరుగురు అధికారులపై వేటుపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. రోహిత్ కులంపై క‌లెక్ట‌ర్ ఇచ్చే ఆధారంగా వెలువ‌డే ఈ నిర్ణ‌యం ఇటు రెవెన్యూ ఉద్యోగుల భ‌విష్య‌త్‌ తో పాటు అటు కేంద్ర మంత్రుల భ‌విష్య‌త్‌ ను సైతం తేల్చ‌నుంది.