Begin typing your search above and press return to search.

మీ జీవితం స్మార్ట్ ఫోన్ చేతిలో బందీ అయ్యింది గమనించారా?

By:  Tupaki Desk   |   28 Dec 2020 11:30 PM GMT
మీ జీవితం స్మార్ట్ ఫోన్ చేతిలో బందీ అయ్యింది గమనించారా?
X
పొద్దున్నే నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ మీద వేళ్లు కదులుతూనే ఉంటాయి. నిత్యం స్ర్క్నీన్ అన్ లాక్ చేయటం.. ఆ వెంటనే లాక్ చేయటం మామూలే. జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్.. ఇవాల్టి రోజున జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఖాళీగా ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ చూసుకోవటం పాతమాట. ఇప్పుడు ఏ కండీషన్లో ఉన్నా.. అదే పనిగా ఫోన్ ను చూసుకోవటం.. అందులో లీనమైపోవటం ఇప్పుడో అలవాటుగా మారింది.

తాజాగా స్మార్ట్ ఫోన్ వాడకంపై సీఎంఆర్ ఫర్ వివో సర్వే నిర్వహించింది. ఆసక్తికర అంశాలతో పాటు.. షాకింగ్ నిజాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగంతో రోజకు సగటున ఏడు గంటల పాటు ఫోన్ తోనే గడిపేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే.. స్మార్ట్ ఫోన్ వినియోగం 25 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు.

కరోనా.. దాని వెంటే వచ్చిన లాక్ డౌన్.. ఆ పై జీవితంలోకి కొత్తగా వచ్చి చేరిన వర్కు ఫ్రం హోం.. స్టడీ ఫ్రం హోం.. ఓటీటీ ప్లాట్ ఫాం.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిన మార్పులు జీవితాల్ని స్మార్ట్ ఫోన్ తో మరింత దగ్గరగా పెనవేసుకునేలా చేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి నవంబరు మధ్యలో దేశంలోని ఎనిమిది నగరాల్లో 15-45 ఏళ్ల మధ్య వయసున్న వారి అబిప్రాయాల్ని సేకరించింది. వాటిని విశ్లేషించిన సర్వే చెప్పిన నిజం ఏమంటే.. బయట ప్రపంచం కంటే కూడా వర్చువల్ ప్రపంచంతోనే ఎక్కువగా కనెక్టు అయినట్లుగా గుర్తించారు.

గతానికి భిన్నంగా మహమ్మారి పుణ్యమా అని.. ఇంట్లో ఎంతమంది ఉంటే.. అన్నిస్మార్ట్ ఫోన్లు దాదాపుగా వచ్చేయటంతో వీటి వినియోగం పెరగటమే కాదు.. అందులోనే గంటల కొద్దీ సమయాన్ని గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగిపోవటంతో కుటుంబ సభ్యులతో గడిపే సమయం గణనీయంగా పెరుగుతోంది. సెల్ ఫోన్ ను అప్పుడప్పుడు స్విచ్చాఫ్ చేసి పక్కన పెట్టటం ద్వారా తమ వాళ్లతో కాస్త ఎక్కువ సమయం గడిపే వీలుందని సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది పేర్కొన్నారు. ఇలా చెప్పిన వారిలో 18 శాతం మాత్రమే.. తాము చెప్పిన మాటల్ని అమలు చేస్తున్నట్లుగా తేలింది. స్మార్ట్ ఫోన్ కారణంగా ఆత్మీయులతో టచ్ లో ఉన్నట్లుగా 79 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయటం విశేషం. మొత్తంగా చూస్తే.. రోజువారీ స్మార్ట్ ఫోన్ వినియోగం.. దానితో ఎంగేజ్ కావటం.. రోజువారీ మనిషి నిద్రకు సమానంగా.. కొందరి విషయంలో ఎక్కువగా ఉండటం గమనార్హం.