Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ రూల్స్ బ్రేక్..కూకట్ పల్లి లో భారీగా ట్రాఫిక్ జామ్!
By: Tupaki Desk | 21 April 2020 11:16 AM GMTఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది. దయచేసి ఇంట్లోనే ఉండండి ..బయటకి వచ్చి కరోనా భారిన పడకండి అని ప్రభుత్వం పోలీసులు - వైద్యులు ఎంత మొత్తుకొని చెప్తున్నా కూడా కొంతమంది వినిపించుకోవడంలేదు.
ఇకపోతే , తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్న నేపధ్యంలో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ లాక్ డౌన్ ను చాలా చోట్ల బేఖాతరు చేస్తున్నారు.సాధరణ రోజుల్లో తిరిగినట్టుగా ... అనవసరంగా బయట తిరుగుతూ పోలీసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ మేర వాహనాలు నిచిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ - సరైన కారణం లేకుండా ఇంట్లో నుండి బయటికి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రజలు అనవసరంగా బయటికి వచ్చేముందు లాక్ డౌన్ ను సక్రమంగా పాటించని ఇటలీని ఒకసారి గుర్తు చేసుకోవాలని మేధావులు సలహా ఇస్తున్నారు.