Begin typing your search above and press return to search.
కిమ్ స్టైల్‌ను కాపీ .. కోట్‌ను నిషేధించిన ప్రభుత్వం
By: Tupaki Desk | 27 Nov 2021 5:05 AM GMTఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. దీనికి కారణం అయన ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలు. కిమ్ ను కొందరు ప్రపంచ నియంతగా అభివర్ణిస్తారు. కరోనాకు తోడు ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఉత్తర కొరియాలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఆహార కొరత దృష్ట్యా ఆహారం తక్కువ తినాలని ఇటీవల ఉత్తర కొరియా ప్రభుత్వం హుకుం జారీచేసింది. తాజాగా, ప్రజలు లెదర్ కోట్ ధరించడాన్ని నిషేధించింది.
ప్రజలెవరూ లెదర్ కోట్ ధరించకూడదని, వస్త్ర వ్యాపారాలు వాటిని విక్రయించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ నిషేధం వెనుక పెద్ద కారణమే ఉంది. డిసెంబరు 2019లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖరీదైన లెదర్ కోట్‌ను ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అది విశేషంగా ఆకర్షించడంతో ఉత్తర కొరియాలోని సంపన్నులంతా ఆయనకు మద్దతుగా అలాంటి లెదర్ కోటునే ధరించడం మొదలుపెట్టారు. అలా ఆ లెదర్ కోట్ అధికారులు, సంపన్నుల ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయింది. అయితే, సామాన్యులు కూడా దానిపై ఆసక్తి ప్రదర్శించడంతో వస్త్ర వ్యాపారులు నాసిరకం లెదర్ కోట్స్ ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటు ధరలో విక్రయిస్తున్నారు.
దీంతో వాటిని కొనుగోలు చేసి ఎంచక్కా తమ దేశాధ్యక్షుడు కిమ్ వస్త్రధారణను అనుకరిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం లెదర్ కోట్ ధరించి.. కిమ్ ను, అధికారుల్ని అవమానిస్తున్నారంటూ వాటిపై నిషేధం విధించారు. ఫ్యాషన్ పోలీసులను నియమించి, కోటు ధరించిన వ్యక్తుల్ని, విక్రయిస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ ఏడాది సెప్టెంబరులో చైనా సరిహద్దులను తెరవడంతో అనధికారికంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేవలం లెదర్ కోటే కాదు బ్లూ జీన్స్, స్కర్ట్స్, డిజైన్ షూస్ తదితర ఫ్యాషన్ దుస్తులపై అక్కడ నిషేధం కొనసాగుతోంది. పాశ్చాత్యదేశాల ఫ్యాషన్ ను తీవ్రంగా వ్యతిరేకించే కిమ్, తమ దేశ ప్రజలు ఆ పోకడలకు అలవాటు పడకూడదని మొదటినుంచి వీటిపై నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.