Begin typing your search above and press return to search.

సైన్స్ ఏం చెబుతోంది.. శృంగారంలో ఎన్ని సార్లు పాల్గొనాలి?

By:  Tupaki Desk   |   10 July 2020 11:30 PM GMT
సైన్స్ ఏం చెబుతోంది.. శృంగారంలో ఎన్ని సార్లు పాల్గొనాలి?
X
శృంగారం దివ్యౌషధం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు పరిశోధనలు కూడా తేటతెల్లం చేశాయి. వారానికి రెండు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారికి మిగతా వారితో పోల్చితే గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. శృంగారం కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్తప్రసరణలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రక్తంలోని టాక్సిన్స్ కూడా తొలగి రక్తం శుభ్రం అవుతుంది.

రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు అవసరమైన హిమోగ్లోబిన్ చక్కగా ఉత్పత్తి అవుతుంది.వృత్తి పరమైన ఒత్తిడులను పడకగదికి తీసుకొస్తే అసలుకే ఎసరు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడిని పారదోలడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరిచి సమస్యలను అధిగమించే శక్తిని శృంగారం అందిస్తుందని చెబుతున్నారు.

భావప్రాప్తి కారణంగా విడుదలయ్యే హార్మోన్లు శరీర మెటబాలిక్ సిస్టమ్ ను పునరుద్ధరిస్తాయి. భావప్రాప్తితో శరీరంలోని ఆక్సిటోసిన్ సాంద్రత ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగిపోతుంది. తద్వార దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారు నెలకు ఒకసారి శృంగారంలో పాల్గొనే వారి కంటే ఎక్కువ రోజులు బతుకుతున్నారు.

పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్త్రీలల్లో ఈస్ట్రోజన్ కేవలం పడకపైనే ఉపయోగపడేవి కావంట. ఎముకలు, కండరాలు, గుండె తదితర అవయవాలకు మేలు చేస్తాయి. అందుకే ఈ హార్మోన్స్ కు ఎంత పని చెప్తే అంత మంచిది.