Begin typing your search above and press return to search.
ఈ సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకండి ... భారత్ బయోటెక్ హెచ్చరిక !
By: Tupaki Desk | 19 Jan 2021 9:53 AM GMTఇండియా లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవాక్సిన్ . కోవాక్సిన్ విషయంలో మాత్రం టీకా తీసుకున్నవారు సమ్మతి పత్రంపై సంతకం చేసి షరతులు అంగీకరించాలి. ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారిలో భారత్ బయోటెక్ కు సంబంధించిన కోవాక్సిన్ టీకాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
దీనితో భారత్ బయోటెక్ ఓ హెచ్చరిక జారీ చేసింది. రోగనిరోధక శక్తి లేనివారు లేదా వారి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కోవాక్సిన్ తీసుకోకూడదని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఒక ఫాక్స్ షీట్ ద్వారా సలహా ఇచ్చింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారిలో చాలా మందికి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపిస్తున్న కారణంగా భారత్ బయోటెక్ తమ టీకాలు తీసుకునే వారి విషయంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమకు వ్యాక్సిన్ ఇస్తున్న అధికారికి ఏవైనా అలెర్జీలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సమస్యలు ఉంటే బహిర్గతం చేయాలని ,వాటిని చెప్పిన తర్వాతే అతనికి వ్యాక్సిన్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వైద్యులు నిర్ణయించి వ్యాక్సిన్ ఇస్తారని పేర్కొన్నారు.
అలెర్జీ చరిత్ర ఉన్నవారు, జ్వరం ఉన్నవారు, రక్తస్రావం ఉన్నవారు లేదా రక్తం తక్కువగా ఉన్నవారు, రోగనిరోధక శక్తి లేనివారు లేదా రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు, గర్భవతులు, తల్లి పాలివ్వడం లేదా మరొక కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నవారు కోవాక్సిన్ వ్యాక్సిన్ ను తీసుకోకూడదని వెల్లడించారు. కరోనా టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా నివేదించబడిన ప్రతికూల సంఘటనల దృష్ట్యా భారత్ బయోటెక్ విడుదల చేసి ఉండవచ్చని ఫ్యాక్ట్ షీట్ పై స్పందిస్తూ ఆరోగ్య నిపుణులు తెలిపారు.
కోవాక్సిన్ తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యకు కారణమయ్యే అవకాశం ఉందని, కానీ చాలా అరుదుగా సంభవించవచ్చని భారత్ బయోటెక్ తన ఫాక్ట్ షీట్ లో వెల్లడించింది. తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరికి వచ్చే రియాక్షన్ సంకేతాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం మరియు గొంతు వాపు, వేగంగా హృదయ స్పందన, శరీరమంతా దద్దుర్లు, మైకము మరియు బలహీనత ఉంటాయని తెలిపింది.