Begin typing your search above and press return to search.
మీకు పుణ్యం ఉంటుంది.. వారిద్దరిని బ్యాన్ చేసేయాలంతే
By: Tupaki Desk | 1 Aug 2019 9:02 AM GMTఇంట్లో ఖాళీగా కూర్చుంటూ పొద్దుపొడవక.. ఖాళీగా కూర్చునే వారికి సీరియల్స్ కు మించిన టైం పాస్ ఉండదు. అదే సమయంలో టైం లేకుండా.. ఏదో పని మీద పరుగులు పెట్టే వారెవరూ సీరియల్స్ ను అస్సలు ఫాలో కారు. ఆ ప్రస్తావన తెస్తేనే చిరాకు పడిపోతారు. అలా అని సీరియల్స్ చూసే వారి మనోభావాలు దెబ్బ తీయటం ఇక్కడ ఉద్దేశం కాదు. సీరియల్స్ ను అభిమానించే వారెంతగా ఉంటారో.. వాటిని ద్వేషించేవారంతగా ఉంటారని చెప్పటమే ఇక్కడ ఉద్దేశం. గడిచిన కొద్ది రోజులుగా బెజవాడ ప్రజలు ఇద్దరు నేతలకు సంబంధించి వారు తెగ చిరాకు పడిపోతున్నారు.
రోజూ.. ఈ గోలేందిరా బాబు అంటూ మండిపడుతున్నారు. సీరియల్స్ ను ఏ మాత్రం ఫాలో కాని వారిని సీరియల్ చూడమని బలవంతం చేస్తే ఎలా ఫీల్ అవుతారో.. ఇప్పుడు బెజవాడ వాసుల ఫీలింగ్ కూడా అలానే ఉంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్సెస్ పీవీపీ మధ్య నడుస్తున్న ట్వీట్ల వార్ పై చిరాకు పడిపోతున్నారు. అదే పనిగా తిట్టుకోవటం.. ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకోవటం తప్పించి.. ప్రజల గురించి..ప్రజాసమస్యల గురించి ఇద్దరిలో ఒక్క నేతకు పట్టటం లేదన్న మండిపాటు వినిపిస్తోంది.
ఈ ఇద్దరు సంపన్నులు తమ జేబులో నుంచి ఒక్క రూపాయి తీసి బెజవాడ సంక్షేమం కోసం పాటు పడరు కానీ.. పైసా ఖర్చు లేకుండా ట్వీట్లు పెట్టే అవకాశాన్ని అందిపుచ్చుకొని బెజవాడ పొలిటికల్ వాతావరణాన్ని తెగ పొల్యూట్ చేస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుకున్నా.. తిట్టుకున్నా బాగానే ఉంటుంది కానీ.. జీడిపాకం మాదిరి ట్వీట్లతో తిట్టుకోవటం.. మాటా.. మాటా అనుకోవటం బాగోలేదని.. హుందాతనాన్ని మర్చిపోయి చిల్లరగా ఒకరిపై ఒకరు నిందలు బాగోలేవంటున్నారు. వీరి ట్వీట్ల గోలను చూస్తున్న కొందరైతే.. ఈ ఇద్దరు నేతల సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేస్తే దరిద్రం వదిలిపోద్దన్న స్థాయిలో ఇరిటేట్ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఈ ఇద్దరు నేతలు బెజవాడ ప్రజల మూడ్ ను చూసైనా కాస్త తగ్గితే మంచిదంటున్నారు.