Begin typing your search above and press return to search.

భారత కంపెనీల్లో చైనా సెంట్రల్ బ్యాంకు చేతి `వాటం`

By:  Tupaki Desk   |   8 July 2020 4:15 AM GMT
భారత కంపెనీల్లో చైనా సెంట్రల్ బ్యాంకు చేతి `వాటం`
X
భారత్-చైైనా సరిహద్దు దగ్గర కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది భారతీయులు, వ్యాపారులు, సంస్థలు చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినదిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా...సమీప భవిష్యత్తులో క్రమేపీ అది సాధ్యం కావచ్చు. మరోవైపు, భారత్ లోని వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా మొగ్గుచూపుతోంది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. లాక్ డౌన్ కంటే ముందు నుంచే చైనా నుండి మన దేశానికి చెందిన వివిధ సంస్థల్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంపై విమర్శలు వచ్చాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) HDFCలో తన పెట్టుబడుల వాటాను 1.01 శాతానికి పెంచుకుంది. 2019లో 0.8 శాతం వాటాను కలిగి ఉన్న PBoC...2020 నాటికి వాటాను పెంచుకుంది.

వీటితోపాటు మరికొన్ని భారత దిగ్గజ కంపెనీల్లో PBoC వాటా కలిగి ఉంది. హెడీఎఫ్ సీలో రూ. 3100 కోట్ల(1.01 శాతం) వాటా కలిగి ఉండగా....పిరమల్ ఎంటర్ ప్రైజెస్ లో రూ.137 కోట్ల వాటా(0.43), అంబూజా సిమెంట్స్ లో రూ.122 కోట్ల వాటా(0.32 శాతం) కలిగి ఉంది. ఇదే తరహాలో చైనీస్ సెంట్రల్ బ్యాంకు కూడా భారత్ లోని పలు కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. అయితే, వాటి వివరాలు బహిర్గతం కాలేదు. కానీ, 2018లో భారత్ లో పెట్టుబడులు పెట్టుకునేందుకు ఆర్ బీఐ చైనా సెంట్రల్ బ్యాంకుకు అనుమతినిచ్చింది. అయితే, భారత్ లోని పలు కంపెనీల్లో చైనా పెట్టుబడుల వెనుకు ఉన్న గుట్టు ఈ మధ్య కాలంలో రట్టయింది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటా దక్కించుకున్న చైనా....వాటి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయాలని కుట్ర పన్నుతోందని ఆ నివేదికలో వెల్లడైంది. పేటీఎమ్, జొమాటో వంటి స్టార్టప్ లకు అలీబాబా సంస్థ పెట్టుబడులు సాయం చేయగా...బైజు, ఓలా, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలలో టెన్సెంట్ పెట్టుబడులు పెట్టింది. కాబట్టి, ఇకనైనా ఎఫ్ డీఐల విషయంలో, విదేశీ పెట్టుబడుల విషయంలో భారత్ ముందుచూపుతో వ్యవహరించాల్నిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.