Begin typing your search above and press return to search.
మీ నిస్వార్ధ సేవకి వందనం !
By: Tupaki Desk | 23 March 2020 10:43 AM GMTకరోనా వైరస్ ప్రభావం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కు వారు వీరు అనే తేడా లేదు. ఎవరిని వదలడం లేదు. కరోనా ఎఫెక్ట్ తో పట్టణాలు, సిటీలు, రాష్ట్రాలు, దేశాలు.. ఇలా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అవుతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇకపోతే ,ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 14,650 మందికి పైగా మరణించగా , కరోనా బాధితుల సంఖ్య 3,37,533కి చేరింది. అలాగే భారత్ లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు సమాచారం.
ఇకపోతే, ఈ కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతున్నా కూడా .. కరోనాని నియంత్రించడానికి , కరోనా సోకిన వారిని ఆ వ్యాధి నుండి బయటపడేయడానికి డాక్టర్లు , మెడికల్ స్టాఫ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలు తీసే వైరస్ అని తెలిసినప్పటికీ ...వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారు. కరోనా పేషేంట్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ..తమకి కరోనా సోకకుండా మాస్కులు, బాడీకి స్పెషల్ డ్రెస్ వేసుకొని వారికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలి అంటే డాక్టర్లు, మెడికల్ స్టాఫ్..ప్రాణాలని పనంగా పెడుతున్నట్టే ..ఇప్పటికే కొన్ని దేశాలలో కరోనాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు దురదృష్టవశాత్తు కరోనా సోకి మృతిచెందారు. అయినప్పటికీ ఎక్కడా కూడా డాక్టర్ల బృందం వెనక్కి తగ్గకుండా కరోనా సోకిన వారిని, బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో, ఐసోలేషన్ వార్డ్స్ లో ఉండి..అలాగే మాస్కులు ధరించి .. కొందరు డాక్టర్ల మొఖాలు కూడా మారిపోయాయి. అయినా కూడా వారి మొఖం పై చిరునవ్వు చెదరలేదు. వారి నిస్వార్థమైన ప్రేమ, త్యాగానికి,,మనం ఏమి ఇచ్చినా, ఏమి చేసినా తక్కువే అవుతుంది. డాక్టర్ల సేవలకు పాదాభివందనం. ఇన్ని రోజులు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకునేవారు ...కానీ డాక్టర్ల రూపంలో మన మధ్యనే తిరుగుతున్నారు అంటూ నెటిజన్స్ డాక్టర్లు , మెడికల్ స్టాఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రాణాలని సైతం లెక్కచేయకుండా ...విధి నిర్వహణలో బిజీగా ఉన్న డాక్టర్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకూడదు అని ..ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం ....