Begin typing your search above and press return to search.

కోవిడ్​ నెగిటివ్​ సర్టిఫికెట్​ తెస్తేనే అనుమతి..! పూరీ ఆలయంలో గవర్నర్​ను ఆపేశారు..!

By:  Tupaki Desk   |   4 Jan 2021 6:19 PM GMT
కోవిడ్​ నెగిటివ్​ సర్టిఫికెట్​ తెస్తేనే అనుమతి..! పూరీ  ఆలయంలో గవర్నర్​ను ఆపేశారు..!
X
ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో ఆ రాష్ట్ర గవర్నర్​కే చేదు అనుభవం ఎదురైంది. ఆయన గుడిలోకి వెళ్లి దర్శనం చేద్దామనుకున్నా.. అక్కడున్న నిబంధనలతో ఆగిపోయారు. పురి జగన్నాథ ఆలయంలోకి ఎవరైనా వెళ్లాలంటే కరోనా నెగిటివ్​ రిపోర్ట్ ఉండాల్సిందే. దీంతో గవర్నర్​ గణేశీ లాల్ వెనుదిరిగి వెళ్లిపోయారు. గవర్నర్​ను గుడిలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేదని అక్కడి నిబంధనుల చూసి ఆయనే స్వయంగా వెళ్లిపోయినట్టు సమాచారం. ఆదివారం ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు పూరీ జగన్నాథుని సన్నిధికి వెళ్లారు. అక్కడి గుడికి ఎవరు వెళ్లాలన్నా కరోనా నెగిటివ్ రిపోర్ట్​ ఉండాల్సిందే. దీంతో గవర్నర్​ దగ్గర కరోనా నెగిటివ్​ రిపోర్ట్​ లేదు. దీంతో ఆయనే స్వచ్చందంగా వెనుదిరిగారని సమాచారం.

కరోనా కారణంగా చాలా రోజులుగా పూరీ జగన్నాథ ఆలయాన్ని మూసివేశారు. అయితే కరోనా ఉధృతి తగ్గడంతో ఇటీవలే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తున్నారు. కానీ కొన్ని నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం.. ఆలయానికి రావాలనుకున్నవారు కచ్చితంగా కరోనా నెగిటివ్​ సర్టిఫికెట్​ తీసుకురావాల్సిందే. అయితే గవర్నర్​కు ఈ విషయం ముందే తెలుసా.. తెలియదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు గవర్నర్​ కార్యాలయ అధికారులకు ఈ విషయం కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు.

కానీ గవర్నర్​ను పూరీ ఆలయ అధికారులు అడ్డుకున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో కొంత గందరగోళం నెలకొన్నది. అయితే సాక్షాత్తు రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన వ్యక్తిని గుడిలోకి రాకుండా ఆపడటం ఏమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ గవర్నర్​ను ఆలయ అధికారులు ఎవరూ ఆపలేదని.. ఆయన స్వయంగా వెనుదిరిగారని ఆలయ అధికారులు క్లారిటీ ఇచ్చారు.