Begin typing your search above and press return to search.
పేర్ని బాబాయ్ : బీజేపీ కూడా ట్రోల్ చేస్తుందే ! అయ్యో అయ్యయ్యో
By: Tupaki Desk | 30 April 2022 3:21 PM GMTశివుడి మెడలో ఉన్నంత వరకే పాముకు విలువ అప్పుడది గరుత్మంతుడిపై కూడా జోకులు వేస్తుంది అని ఓ సినిమాలో డైలాగ్.. మన పేర్ని నాని సిట్యువేషన్ కూడా అలానే ఉంది. తన బలము కన్నా స్థాన బలము మిన్న అంటే ఇదే ! అయినా కూడా మాజీ మంత్రి తగ్గరు. అదే పనిగా సంచలన వ్యాఖ్యలు చేయడం మానుకోరు. ఆ విధంగా తన అస్తిత్వం చాటే మాజీ మంత్రి పై బీజేపీ కూడా జోకులు వేస్తోంది. జనసేనతో కూడుకుని గొంతు వినిపిస్తోంది. ఆ వివరం ఈ కథనంలో...
నిన్నటి వరకూ వేరు..ఇప్పుడు వేరు..నిన్నటి వరకూ ఆయన ఓ హోదాలో ఉన్న పాలక వర్గ ప్రతినిధి. ఇప్పుడు మాత్రం హాయిగా తన నియోజకవర్గం అయిన మచిలీపట్నం ఎమ్మెల్యే మాత్రమే! ఏ విధంగా చూసుకున్నా కూడా కాల గమన రీతిలో ఆయన ఓ దురదృష్టవంతుడే ! మొన్నటిదాకా సినిమాటోగ్రఫీ మంత్రి ! కానీ ఇప్పుడు చాలా అంటే చాలా మౌనంగా ఉంటున్న ఓ అతి సాదా సీదా మనిషి. అందుకే ఏమయినా అనుకోండి అధికారం ఉన్నన్నాళ్లూ ఆయన మాట కు ఆ రోజు తిరుగులేదు.
కానీ ఈరోజు ఆయన మాట వినేవారే లేరు. పవన్ ను తిట్టినా లేదా చిరును పొగిడినా పేర్ని వెంకట్రామయ్యకు అలియాస్ పేర్ని నానికి తిరుగే లేదు. టికెట్ రేట్ల ఇష్యూ పై మాట్లాడినా లేదా తనకు సంబంధం లేకపోయినా సమాచార మంత్రి హోదాలో మిగతా శాఖలపై పట్టు తెచ్చుకుని పిడికిలి బిగించి మాట్లాడినా అవన్నీ ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. వివాదాల పరంగానే పేరు తెచ్చాయి.
మీడియా అటెన్షన్ ఆయన కోరుకోలేదు. కానీ కోరి కోరి వచ్చింది. ఈయన కోరి కోరి కొన్ని మాటలు చెప్పడం వల్లనే ఇదంతా అని ఆ రోజు విపక్షం కూడా మంత్రి హోదాలో ఉంటూ కూడా చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై మండి పడింది. ఇంకా ఆయన ఎన్నో తప్పిదాలు చేసి ఆఖరులో మీడియా ప్రతినిధులకు ఓ స్వీట్ బాక్స్ ఇచ్చి సారీ కూడా చెప్పి వెళ్లారు. ప్రయివేటు బస్ ఆపరేటర్ల సమావేశంలో చాలా అంటే చాలా భావోద్వేగానికి లోనయ్యారు. అది రవాణా శాఖ మంత్రి హోదాలో.. ! కానీ ఇప్పుడు ఆ హోదా లేదు. పదవి లేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయంలో తనకన్నా జూనియర్ అయిన సీదిరి అప్పల్రాజు ఓ చోటకు వెళ్తే ఆయనకు దూరంగా ఉంటూ నిలబడిపోయారు. ఇప్పుడిదే ఫొటో వైరల్ అవుతోంది. బీజేపీ ఆయన్ను ట్రోల్ చేస్తోంది. సాధారణంగా ఏపీ బీజేపీ ఫోర్స్ మరీ అంతగా మంత్రులను టార్గెట్ చేసిన దాఖలాలు లేవు.
కానీ ఈ సారి ఏకంగా మన మోడీ పేజ్ ను నడుపుతున్న నిర్వాహకులు మంత్రి సీదిరికి దూరంగా నిలబడి చూస్తున్న పేర్ని నాని ఫొటోను భలే ట్రోల్ చేస్తుంది.న ఎలా ఉన్నవారు ఎలాఅయిపోయారో అన్న వచ్చే విధంగా మాటలను వ్యాఖ్యల రూపంలో జోడించి, ట్రోల్ చేస్తున్నారు. మంత్రి సీదిరి అప్పల్రాజు కేంద్ర మంత్రి మురుగన్ తో మాట్లాడుతున్న సందర్భంగా (ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనకు విచ్చేశారు ఆయన) ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఫొటోను బీజేపీ అనే కాదు జనసేన కూడా ట్రోల్ చేస్తోంది.
కృష్ణా జిల్లా, మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను కేంద్ర మంత్రితో కలిసి సీదిరి పరిశీలిస్తుండగా మాజీ మంత్రి పేర్ని నాని దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది.ప్రొటోకాల్ లో భాగంగానే ఆయన ఆ విధంగా ఉండిపోవాల్సి వచ్చిందని కొందరు వైసీపీ నాయకులు సమర్థించుకుంటున్నారు కూడా ! ఏదేమయినా అధికారం ఉన్నప్పుడే గౌరవం లేదంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఇటీవల సీఎంఓ కు వచ్చిన సందర్భంగా కూడా ఆయనను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోక పోవడం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
ఇక అదే రోజు అదే ప్రాంతంలో సముద్రమొగ పరిశీలనకు ఇద్దరు మంత్రులూ (కేంద్రమంత్రి మురుగన్, రాష్ట్ర మంత్రి సీదిరి) వెళ్లినా కూడా పేర్ని నాని మాత్రం దూరంగానే ఉండిపోయారు. ముభావంగానే ఉండిపోయి తరువాత ఎప్పుడూ వచ్చే ప్రదేశమే కదా అని సమర్థించుకుని తప్పుకున్నారు మీడియా ఎదుట! ఏదేమయినా పోర్టు అభివృద్ధి ఎలా ఉన్నా కూడా మాజీ మంత్రి ని మాత్రం ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అలా అని వీళ్లంతా తమ అధినేత పై తిరుగుబాటు చేయలేరని కూడా టీడీపీ అంటోంది. బీజేపీ కూడా తెల్లారితే మైకు ముందుకు వచ్చి మాట్లాడే పేర్ని నాని ఎలా అయిపోయారో అని సెటైర్లు ప్లే చేస్తుంది.