Begin typing your search above and press return to search.
టికెట్ ధరల పై కొత్త జీవో విడుదలలో జాప్యం ఎందుకు..?
By: Tupaki Desk | 26 Feb 2022 5:54 AM GMTపవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోడానికి ప్రయత్నిస్తోందంటూ అభిమానుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే సవరించిన కొత్త జీవో విడుదలలో జాప్యం చేస్తున్నారని.. జీవో నెం.35 ప్రకారమే సినిమా టికెట్లు అమ్మాలని థియేటర్ల యజమానులకు ఆదేశాలు జారీ చేయడం పవన్ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనడానికి నిదర్శనమని కామెంట్స్ చేశారు.
శుక్రవారం ‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా ఆంధ్రాలోని థియేటర్ల వద్ద నెలకొన్న పరిస్థితులపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమా విడుదల పై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. జీఓ విడుదలలో జాప్యం ఎందుకు జరిగింది అనే విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఫిబ్రవరి 23 లేదా 24న జీవో జారీ కావాల్సి సవరించిన జీఓ ఆలస్యమైందని పేర్ని నాని తెలిపారు. ''ప్రభుత్వం నిర్దేశించిన జీవోను తాత్కాలికంగా నిలిపి, జాయింట్ కలెక్టర్ల దగ్గర అనుమతి తీసుకోమని హైకోర్టు తీర్పు చెప్పింది. దానికి అనుగుణంగా మీరెందుకు చేయరు? మా ఇష్టారాజ్యం అంటే ఎలా కుదురుతుంది?'' అని ప్రశ్నించారు పేర్ని నాని.
''ఫిబ్రవరి 21న టికెట్ ధరల విషయమై కమిటీతో భేటీ.. 22న సినిమాటోగ్రఫీ హోం సెక్రటరీ జీవోకు ఓ డ్రాఫ్ట్ రూపొందించి లా డిపార్ట్ మెంట్ కు పంపించటం.. ఈ నెల 23 లేదా 24న జీవో రావటం.. ఇదీ ప్రణాళిక. మా మిత్రుడు, మంత్రి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ఆలస్యమైంది. మంచి మనిషిని కోల్పోయిన బాధలో మేం ఉంటే, జీవో రావట్లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు. చావును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. అలాంటి వారిని ఏమనాలి?" అని పేర్ని నాని అన్నారు.
''గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసుకున్నవారు. సినిమాను రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోలేరా? అలా జరగనప్పుడు ప్రస్తుతమున్న నిబంధనలే పరిగణనలోకి వస్తాయి. అంతెందుకు సినిమాను ఉచితంగా చూపిస్తామని అన్నారు కదా.. అలా చేయకుండా బ్లాక్ లో టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారు?'' అని మంత్రి ప్రశ్నించారు.
ఇకపోతే ‘భీమ్లా నాయక్’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది కాబట్టి.. వచ్చే వారంలో ఏపీ సర్కారు కొత్త రివైజ్డ్ జీవో రిలీజ్ చేస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అదే జరిగితే సమ్మర్ సీజన్ లో విడుదల ప్లాన్ చేసుకున్న చిత్రాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఏదేమైనా ఇంకా జాప్యం చేయకుండా.. వీలైనంత త్వరగా టికెట్ రేట్ల మీద జీవో రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.