Begin typing your search above and press return to search.

పవన్ ఏం చేయాలో వైసీపీ నేతలు డిసైడ్ చేయాలా పేర్ని నాని?

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:47 AM GMT
పవన్ ఏం చేయాలో వైసీపీ నేతలు డిసైడ్ చేయాలా పేర్ని నాని?
X
అంచనాల కంటే వేగంగా రియాక్టు అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ ఎపిసోడ్ నేపథ్యంలో తనకు దన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖపట్నంలో తనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మొదట నారా లోకేశ్ ట్విటర్ లో రియాక్టు కావటం.. ఆ తర్వాత చంద్రబాబు స్పందించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మంగళవారం చంద్రబాబు నాయుడితో కలిసి ఒక హోటల్లో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. తనకు సంఘీభావం తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పరిణామం వైసీపీకి షాకింగ్ గా మారింది. గడిచిన కొంతకాలంగా టీడీపీ - జనసేనలు కలవకుండా ఉండాలని.. వారిద్దరూ కలిసి పోటీ చేయటానికి వీల్లేని విధంగా మాటలు మాట్లాడటం తెలిసిందే. నిన్నటికి నిన్న పేర్ని నాని మాట్లాడుతూ.. పవన్ ను ప్యాకేజీ స్టార్ అనకుండా ఉండాలంటే 2024లో రాష్ట్రంలోని మొత్తం స్థానాలకు జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తే తాము ప్యాకేజీ స్టార్ అనమని చెప్పటం ఇందుకు నిదర్శనం.

జనసేన పార్టీ ఏమీ వైసీపీకి అనుబంధ సంస్థ కాదు. వారు చెప్పినట్లుగా.. వారు డిసైడ్ చేసినట్లుగా నడవటానికి. తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తే.. 'మిమ్మల్ని ఏమీ అనం' అన్నట్లుగా చెప్పిన మాటల్ని చూస్తే వైసీపీ నేతలు ఏం కోరుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. తాము చెప్పినట్లుగా.. తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరే రీతిలో పవన్ కల్యాణ్ వ్యవహరించాలన్నట్లుగా వైసీపీ నేతల మాటలు ఉండటం గమనార్హం.

ప్రత్యర్థి పార్టీలు తాము చెప్పినట్లుగా చేయాలన్న వాదన పేర్నినాని మాటల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఒక రాజకీ పార్టీగా ఎన్నికల వ్యూహం ఏమిటి? ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లాలి? ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? వద్దు? అనేది ఆ పార్టీ సొంత విషయం. ఎన్నికలకు ముందు పొత్తును ఎవరైనా స్వాగతిస్తారు.

అందుకు భిన్నంగా వైసీపీ నేతల తీరు మాత్రం భిన్నంగా ఉండటాన్ని తప్పు పడుతున్నారు. తమ ప్రత్యర్థి పార్టీ తాము చెప్పినట్లే వినాలని.. తాము గీసిన గీతలకు లోబడి మాత్రమే పని చేయాలన్నట్లుగా వ్యవహరించటం అర్థం లేనిది. ఆ విషయాన్ని వదిలేసి.. పవన్ మీద పెత్తనం చేసేలా.. తాము చెప్పినట్లు వినాలన్నట్లుగా మాట్లాడే పేర్నినానికి ఏం హక్కు ఉంది? అన్నది అసలు ప్రశ్న.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.